BigTV English
Advertisement

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Telugu Actress.. తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభాలు అని చెప్పగానే వెంటనే నటులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR)తో పాటు దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు (ANR). వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ఇద్దరు కలసి పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కూడా. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఎంత ప్రతిభ ప్రదర్శించినా కూడా దక్కాల్సిన గౌరవం , గుర్తింపు ఒక్కోసారి లభించదు. అలా చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటన కనబరిచిన కొందరు నటీనటులు వారి సాటి నటీనటులతో పోల్చుకుంటే మరుగున పడిపోయారని చెప్పాలి. అలాంటి వారిలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లనే తన అద్భుతమైన నటనతో ఢీ కొట్టిన సూర్యకాంతం (Suryakantam)కూడా ఒకరు.


ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లానే నటనతో ఢీ కొట్టిన నటి..

నటనలో ఎంతో గుర్తింపు అందుకున్న ఈమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రేంజ్ లో ఆ స్టార్ డంను అందుకోలేకపోయింది. 1924 కాకినాడలో పుట్టిన సూర్యకాంతం చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. సూర్యకాంతం అంటే వెండితెరపై గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు అని అందరూ చెబుతారు. ఆ తరహా పాత్రలకు అప్పట్లో ఆమెకు పోటీగా ఎవరు ఉండేవారు కూడా కాదు. ఒకవేళ ఉన్నా సరే ఆమె తరహాలో మెప్పించడం అంటే కష్టం. అందుకే ఆమెను అభిమానులు గుర్తించుకున్నారు. కానీ చిత్ర పరిశ్రమ, ప్రభుత్వాలు మాత్రం గుర్తించాల్సిన స్థాయిలో మాత్రం గుర్తించలేదు అని చెబుతూ ఉంటారు.


ఇంత ప్రతిభను ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదు..

ఇదిలా ఉండదా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ సీనియర్ నటులు మురళీమోహన్ (Murali Mohan) సూర్యకాంతం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ.. నేను సూర్యకాంతం, సావిత్రి లాంటి ఎంతోమంది మహా నటీమణుల తో పనిచేశాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక మాట అంటూ ఉంటారు. ఎస్సీ రంగారావు సీన్లో ఉంటే ఆయన డామినేషన్ కు ఎన్టీఆర్ , ఏఎన్నార్ ఇద్దరు తట్టుకోలేరు అని. ముఖ్యంగా ఎస్విఆర్ డైలాగ్ డెలివరీ అలా ఉండేది. అలాంటి ఎన్టీఆర్ , ఏఎన్నార్ , ఎస్వీఆర్ ముగ్గురిని డామినేట్ చేసిన నటి సూర్యకాంతం మాత్రమే అంటూ మురళీమోహన్ తెలిపారు.

సూర్యకాంతం కు పద్మశ్రీ ఇవ్వాలి – మురళీమోహన్..

Telugu Actress: The actress who collided with NTR and ANNAR.. But only if she died.. !
Telugu Actress: The actress who collided with NTR and ANNAR.. But only if she died.. !

ముఖ్యంగా సావిత్రి కంటే కూడా సూర్యకాంతం డామినేట్ చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, సహజంగా అనర్గళంగా ఆమె డైలాగులు చెబుతారని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. సినిమాలలో గయ్యాలి పాత్రలు వేసినప్పటికీ ఆమె బయట అందరితో ప్రేమగా ఉండేవారు. ఆమె మంచి మనసుకు కేరాఫ్ అడ్రస్. అయితే ఆనాటి ప్రభుత్వాలు, చిత్ర పరిశ్రమ ఆమెను గుర్తించలేదు అనేది వాస్తవం. ఆమె విగ్రహాన్ని కూడా పెట్టలేకపోయాం .అలాంటి నటికీ పద్మశ్రీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మురళీమోహన్ తెలిపారు.

చనిపోతే ఒక్కరు కూడా రాలేదు..

ఇదిలా ఉండగా.. ఎప్పుడు కూడా ఆమెలో రవ్వంత గర్వం కూడా కనిపించేది కాదు అని తెలిపిన మురళీమోహన్ ..ఆమె చనిపోతే ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. సావిత్రికి కూడా అలాగే జరిగింది . ఆమె మరణించిన తర్వాత పట్టుమని పదిమంది కూడా ఆమెను చూడడానికి వెళ్లలేదు. దాసరి, ఏఎన్ఆర్ మాత్రమే వెళ్లారు అంటూ మురళీమోహన్ తెలిపారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన నటన ప్రదర్శించిన నటీమణులకు ఆ స్థాయిలో గుర్తింపు లభించకపోవడం బాధాకరమని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×