iQOO 15 Smartphone: పపర్‌ఫార్మెన్స్ సెగ్మెంట్‌లో తన స్థానం స్పష్టంగా స్థాపించుకున్న బ్రాండ్ ఐక్యూఓ, తాజా మోడల్ విడుదలతో మరోసారి చర్చలోకి వచ్చింది. ఆ దిశగా, కొత్త iQOO 15 భారత మార్కెట్లో అధికారికంగా ప్రవేశించి టెక్ మార్కెట్‌లో ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ ఫోన్ ప్రధానంగా పవర్ యూజర్లు, ప్రొఫెషనల్ గేమర్లు, హెవీ టాస్కులు చేసే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఒక్కసారి చూసిన వెంటనే ప్రీమియమ్ లక్షణాలు కనిపించేలా అప్‌డేటెడ్ లుక్‌తో వచ్చింది. చేతిలో పట్టుకున్న వెంటనే తేలికగా అనిపించే గ్రిప్ తో ఐక్యూఓ 15 వినియోగదారులను ఆకర్షిస్తోంది. ప్రీమియమ్ ఫినిష్, మెరుగైన బాడీ క్వాలిటీ ఈ ఫోన్ ను చూసే క్షణం నుంచే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
6.85 ఇంచుల 2కే అమోలెడ్ స్క్రీన్
డిస్‌ప్లే పరంగా చూస్తే 6.85 ఇంచుల 2కే అమోలెడ్ స్క్రీన్, 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ స్థాయి స్మూత్ విజువల్ అనుభవం సాధారణ ఫోన్లలో దొరుకదు. సినిమా చూస్తున్నా, గేమింగ్ చేస్తున్నా, స్క్రోలింగ్ చేస్తున్నా ప్రతి కదలిక నయపుడుతనం తో కళ్లకు ఇంపుగా కనిపిస్తుంది. రంగులు మరింత నిజమైనట్లుగా చూపించే క్వాలిటీ ఐక్యూఓ ఈసారి చాలా దృఢంగా అందించింది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్
పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉపయోగించారు. ఇది ఇప్పటి వరకు వచ్చిన ఫోన్లలో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ లిస్ట్‌లో ముందుంటుంది. భారీ గేమ్స్, హై గ్రాఫిక్స్ యాప్‌లు, మల్టీటాస్కింగ్ అన్నింటినీ ఒకేసారి ఎటువంటి ల్యాగ్ లేకుండా నిర్వహిస్తుంది. గేమింగ్‌లో వేడి పెరగకుండా 8కే వీసీ కూలింగ్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలం వరకూ స్మూత్ పర్‌ఫార్మెన్స్ కొనసాగే అవకాశం ఉంది.
మూడు 50ఎంపీ లెన్స్ కెమెరా
కెమెరా విభాగంలో మూడు 50ఎంపీ లెన్స్‌లతో కూడిన త్రిపుల్ కెమెరా అమరికను ఐక్యూఓ 15లో ఏర్పాటు చేశారు. 50ఎంపీ మెయిన్ లెన్స్ తో పాటు టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్‌లు వివిధ లైటింగ్ పరిస్థితుల్లో కూడా స్పష్టతను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీడియో మోడ్‌లో స్టబిలైజేషన్ ఆశించినంత సాఫీగా పని చేస్తోంది. ముందు భాగంలో 32ఎంపీ కెమెరా అందించడంతో సెల్ఫీ విభాగంలో కూడా ఈ ఫోన్ మంచి ప్రదర్శన ఇస్తోంది.
7,000ఎంఏహెచ్ కెపాసిటీతో బ్యాటరీ
బ్యాటరీ సెగ్మెంట్ లో ఐక్యూఓ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. 7,000ఎంఏహెచ్ కెపాసిటీతో వచ్చిన ఈ బ్యాటరీ, ఒకసారి ఛార్జ్ చేస్తే లాంగ్ అవర్స్ యూసేజ్ అందించగలదని కంపెనీ క్లెయిమ్ చేసింది. రిగ్యూలర్ యూసేజ్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా గానీ, కంటిన్యూస్ గేమింగ్ గానీ చేసినా పవర్ డ్రెయిన్ స్లోగా జరిగేలా ఆప్టిమైజేషన్ చేశారు. 100వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 40వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల పవర్ రికవరీ చాలా స్పీడ్ గా జరుగుతోంది. కేవలం కొన్ని నిమిషాల ఛార్జ్ తోనే గంటల కొద్దీ ఉపయోగించగల అవకాశం ఉండటం హెవీ యూజర్లకు మెయిన్ అడ్వాంటేజ్‌గా మారింది.
రెండు వేరియంట్లలో ధర ఎంతంటే?
స్టోరేజ్ ఆప్షన్ల పరంగా ఐక్యూఓ 15 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12జీబీ ప్లస్ 256జీబీ మోడల్ ధరను రూ.72,999గా ఫిక్స్ చేయగా, 16జీబీ ప్లస్ 512జీబీ వేరియంట్ ధర రూ.79,999గా ప్రకటించారు. అయితే సేల్ సమయంలో అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్లతో ప్రైస్ స్ట్రక్చర్ పూర్తిగా మారుతోంది. ఆక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పేమెంట్ చేస్తే వెంటనే రూ.7,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ ఇచ్చే ఎక్స్చేంజ్ పై ఇంకో రూ.7,000 బోనస్ అందించనున్నారు. అంతేకాకుండా అదనంగా రూ.1,000 కూపన్ డిస్కౌంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా ఈ ఆఫర్లు జోడిస్తే ప్రైస్ సుమారు రూ.15వేల వరకు తగ్గి, ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ లో ఐక్యూఓ 15 ఒక స్ట్రాంగ్ ఓప్షన్ గా మారుతోంది.
ఎందుకు పర్‌ఫెక్ట్ ఈ పోన్ అంటే..
కేవలం ఫీచర్ల పరిమితిలోనే కాకుండా, రియల్ యూజర్ అనుభవంలో కూడా ఐక్యూఓ 15 స్పెషల్ ఇంపాక్ట్ చూపిస్తోంది. గేమింగ్ ప్రియులు, స్ట్రీమింగ్ చూసే సినీ అభిమానులు, కెమెరా అవుట్‌పుట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు, ఛార్జ్ ఒకసారి చేస్తే లాంగ్ అవర్స్ యూజ్ కోరుకునేవారు అన్నింటినీ ఒకే ఫోన్ లో సమర్థంగా హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని ఈ మోడల్ చూపిస్తోంది. అందుకే ఫ్లాగ్‌షిప్ పోటీలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లాంగ్ బ్యాటరీ, స్మూత్ పర్‌ఫార్మెన్స్, స్ట్రాంగ్ కెమెరా రిజల్ట్, పైగా మంచి డిస్కౌంట్ బెనిఫిట్స్ మీ ప్రాధాన్యాలేనా? అయితే ఐక్యూఓ 15 ను పరిశీలించడం వినియోగదారులకు సరైన నిర్ణయం కావచ్చు. ఫ్లాగ్‌షిప్ క్లాస్‌లో రియలిస్టిక్ పర్‌ఫార్మెన్స్ కోరేవారికి ఇది స్ట్రాంగ్ కాంపిటీటర్ గా నిలుస్తోంది, ప్రైస్ టు పవర్ బాలెన్స్ లో ఐక్యూఓ 15 ముందంజలో నిలుస్తోంది.