E-Paper
Advertisement

Tirupati Crime: ఓ ఇంట్లో మూడు మృతదేహాలు.. షాకైన పోలీసులు, ఆ లింకులు బయటకు

Tirupati Crime: ఓ ఇంట్లో మూడు మృతదేహాలు.. షాకైన పోలీసులు, ఆ లింకులు బయటకు
Advertisement

Tirupati Crime: ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలీదు. కాకపోతే ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనేక అనుమానాలు.  చివరకు ఈ మేటర్ పోలీసుల వరకు వెళ్లింది. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి మూడు మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన తిరుపతిలోని తిరుచానూరు ప్రాంతంలో చోటు చేసుకుంది.

తిరుచానూరులో దారుణం, ఓ ఇంట్లో మూడు మృతదేహాలు

Advertisement

తిరుచానూరు ప్రాంతంలోని దామినేడు ఇందిరమ్మ గృహా సముదాయంలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. వారొచ్చి ఇంటి తలుపులు పగలకొట్టారు. నిర్జీవంగా పడున్న మూడు మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు.

వాటిని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను గుర్తించారు. వారిలో సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీష్‌ ఉన్నారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలీదు. ఈ ఇంట్లో ఎవరు ఉండేవారు? ఏమైనా గొడవలు జరిగాయా? అనే కోణంలో స్థానికులను విచారిస్తున్నారు పోలీసులు.

Advertisement

షాకైన పోలీసులు.. తీగలాగితే డొంక కదిలింది

మృతుడు సత్యరాజ్ సొంతూరు తమిళనాడులోని గుడియాతం. భార్యను వదిలేసి దామినేడు ప్రాంతానికి చెందిన పొన్నాగుట్టె నాయకి‌తో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. మూడు నెలలుగా ఆ ఇంట్లో కాపురం పెట్టాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

నవంబర్ 22న ముందు చూశామని, ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు రాలేదని చెబుతున్నారు స్థానికులు. ఇంట్లోని ఓ మూల విషం సీసా లభ్యమైంది. మహిళతోపాటు ఆమె కొడుకుని చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా? పొంగొటై, ఆమె కొడుకు విషం తాగి చనిపోయిన తర్వాత సత్యరాజ్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం

దీనిపై తిరుచానూరు పోలీసులు.. తమిళనాడులోని గుడియాత్తం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సత్యరాజ్ కుటుంబ సభ్యులు వస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఈలోపు స్థానికంగా కొంత సమాచారాన్ని సేకరించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×