KL Rahul -Kohli : ప్రస్తుతం టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ కొనసాగుతుంది. మూడు వన్డే సిరీస్ లో భాగంగా రాంచీలో తొలి వన్డే పూర్తి అయింది. రాయ్ పూర్ లో రెండో వన్డే, విశాఖపట్టణంలో మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. అయితే రాంచీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు చేశాడు. కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 349 పరుగులు చేసింది. దీంతో 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు ఛేజింగ్ లో 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియా విజయం సాధించడంతో కెప్టెన్ కే.ఎల్.రాహుల్ ఆధ్వర్యంలో సెలబ్రేట్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ కే.ఎల్. రాహుల్ కేకు కట్ చేశారు.
అయితే టీమిండియా కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదు. నేరుగా లిప్ట్ లో వెళ్లిపోయారు. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేశారు. సెలబ్రేషన్స్ కి మాత్రమే కాదు.. తొలి వన్డే మ్యాచ్ తరువాత విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ కి మెట్లు ఎక్కుతూ వెళ్లాడు. ప్రధానంగా అక్కడ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తలుపు వద్ద ఉన్నాడు. అయితే గంభీర్ సమీపం వద్దకు వెళ్లే ముందే విరాట్ కోహ్లీ జేబులో నుంచి తన ఫొన్ తీశాడు. ఫోన్ చూస్తూ.. కోచ్ గంభీర్ ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు విరాట్ కోహ్లీ కావాలనే కోచ్ గంభీర్ ను పట్టించుకోలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టీమిండియా కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో 102 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో కోహ్లీ కి ఇది 52వ సెంచరీ. దీని ఫలితంగా వన్డే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను సైతం కోహ్లీ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో విరాట్ తో పాటు రోహిత కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ కలిసి 109 బంతుల్లో 136 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్ శర్మ 51 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్ గా వరల్డ్ రికార్డ్ సాధించాడు రోహిత్ శర్మ.
Also Read : CM Revanth Reddy: మెస్సీ తో ఫుట్ బాల్ మ్యాచ్..బరిలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
"Virat sir Virat sir", he kept calling but this arrogant guy didn't listen & spoiled whole team atmosphere!
Tbh blaming Gautam Gambhir for everything is wrong. Even the whole team was there for the cake cutting ceremony including Rohit, Rahul, jadeja. pic.twitter.com/YWNqHfwIon
— Vishnu (@125notoutk) December 1, 2025