iQOO 15 Ultra: మొబైల్‌లో ఎక్కువగా గేమ్స్ ఆడటానికి ఇష్టపడే వారి కోసం ప్రముఖ టెక్ సంస్థ ఐకూ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ బ్రాండ్ నుంచి రాబోతున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘ఐకూ 15 అల్ట్రా’ త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ కాబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ ఫోన్ EEC సర్టిఫికేషన్ డేటాబేస్‌లో ప్రత్యక్షమవ్వడంతో టెక్ ప్రియుల్లో దీనిపై ఆసక్తి పెరిగింది.
గతంలో చైనాలో లాంచ్ అయిన మోడల్‌తో పాటు ఒక అంతర్జాతీయ మోడల్ నెంబర్ కూడా ఈ సర్టిఫికేషన్ జాబితాలో కనిపించింది. దీంతో ఈ ఫోన్ త్వరలోనే ఇతర దేశాల వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. గేమ్స్ ఆడేటప్పుడు నెట్‌వర్క్ సమస్యలు రాకుండా ఇందులో ప్రత్యేకంగా ‘ఏఐ ఈస్పోర్ట్స్ సిగ్నల్ ఇంజిన్ 2.0’ సాంకేతికతను అందించారు. దీనివల్ల ఇంటర్నెట్ చాలా వేగంగా పనిచేస్తుంది.
Also Read: PhonePe కొత్త రూల్.. అకౌంట్ నుంచి రూ.100 కట్ కాకూడదంటే.. ఇదిగో సింపుల్ ట్రిక్!
iQOO 15 Ultra ఫోన్ డిస్‌ప్లే కళ్లకు అలసట తగ్గించే ప్రత్యేక ప్రొటెక్షన్ టెక్నాలజీతో వస్తోంది. దీని బ్రైట్‌నెస్ ఏకంగా 8000 నిట్స్ వరకు ఉంటుంది. దీంతో ఎండలో కడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం వెనుక వైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
గేమర్స్ ఎదుర్కొనే ప్రధాన సమస్య ఫోన్ వేడెక్కడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం. కానీ ఈ iQOO 15 Ultraలో ఏకంగా 7400mah బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 40 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో ఎంతసేపు గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఐస్ డోమ్ కూలింగ్ ఫ్యాన్, ప్రత్యేకమైన కూలింగ్ ప్లేట్లను ఉపయోగించారు. అలాగే ఇందులోని డాల్బీ అట్మాస్ స్పీకర్లు గేమింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి.
చైనాలో ఇప్పటికే మంచి సక్సెస్ అందుకున్న ఈ iQOO 15 Ultra.. గ్లోబల్ లవర్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే ఇండియాలో ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Also Read: WhatsAppలో బిగ్ ఛేంజ్.. హ్యాకర్లకు చెక్ పెట్టేలా ‘ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్’తో ఫుల్ ప్రొటెక్షన్!