Andhra Devotee: తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలో విషాద ఘటన చోటు చేసుకుంది. మోక్ష మార్గంలో దూరి తెలుగు భక్తుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. గిరివలం మార్గంలోని ఇడుకు పిల్లయ్యార్ ఆలయంలో ఏపీ భక్తుడి మృతి చెందాడడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన మణికుమార్ (36) గా అధికారులు తెలిపారు.
ఇరుకైన మార్గంలో శరీర బరువు కారణంగా చిక్కుకున్న భక్తుడు చిక్కున్నాడు. దీంతో బయటకు రాలేక శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో మణికుమార్‌ను అక్కడి స్థానికులు, తోటి భక్తులు కలిసి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు.
Also read: ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని మోదీయే.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!
మణికుమార్ తిరువణ్ణామలైలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని అధికారులు తరలించారు. భక్తి శ్రద్దలతో దైవాన్ని తలుచుకూంటూ ఇరుకైన స్థలంలో ఉపిరి ఆడక చనిపోవడంతో అక్కడి ప్రాంతం అంతా విషాదచాయలు అలుముకున్నాయి.
Also read: Keesara Crime: ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం!