PhonePe Wallet: ఫోన్‌పే వాలెట్ యూజర్లకు కంపెనీ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. ఇకపై వరుసగా ఒక ఏడాది పాటు అంటే 365 రోజుల పాటు ఫోన్‌పే వాలెట్‌ను ఒక్కసారి కూడా వాడకపోతే.. ఇన్-యాక్టివిటీ మెయింటెనెన్స్ ఛార్జీ కింద రూ.100 కట్ చేస్తామని తెలిపింది. అయితే ఈ ఛార్జీ విధించే ముందు యూజర్లకు 15 రోజుల ముందే ఒక వార్నింగ్ మెసేజ్ కూడా పంపుతామని స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధన చాలామంది యూజర్లకు కాస్త ఆశ్చర్యాన్ని, అసంతృప్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాల నుంచే UPI లావాదేవీలు చేస్తూ.. వాలెట్‌ను పట్టించుకోని వారికి ఇది కాస్త వింతగా అనిపిస్తోంది. కేవలం యాప్ ఓపెన్ చేసినంత మాత్రాన లేదా సాధారణ యూపీఐ పేమెంట్లు చేసినంత మాత్రాన వాలెట్ యాక్టివ్‌గా ఉన్నట్లు పరిగణించరు. కచ్చితంగా వాలెట్ ద్వారా ఏదో ఒక లావాదేవీ జరగాల్సిందేనట.
Also Read: WhatsAppలో బిగ్ ఛేంజ్.. హ్యాకర్లకు చెక్ పెట్టేలా ‘ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్’తో ఫుల్ ప్రొటెక్షన్!
ఈ రుసుము నుంచి తప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఏడాదికి కనీసం ఒక్కసారైనా మీ వాలెట్ ద్వారా ఏదైనా ఒక చిన్న లావాదేవీ చేస్తే సరిపోతుంది. వాలెట్ లోకి కొంత డబ్బులు యాడ్ చేయడం, లేదా అందులో ఉన్న డబ్బుతో ఏదైనా బిల్లు కట్టడం, షాపింగ్ చేయడం లాంటివి చేస్తే మీ వాలెట్ మళ్లీ యాక్టివ్ అయిపోతుంది. దీంతో ఆ ఏడాదికి మెయింటెనెన్స్ ఛార్జీ పడే అవకాశం ఉండదు.
మీ వాలెట్‌లో రూ.100 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే.. కంపెనీ ఆ ఉన్న మొత్తాన్ని మాత్రమే తీసుకుంటుంది. అంటే మీ వాలెట్ బ్యాలెన్స్ సున్నా అవుతుందే తప్ప, మైనస్‌లోకి వెళ్లడం లేదా మీరు రివర్స్‌లో కంపెనీకి డబ్బులు బాకీ పడటం లాంటివి జరగవు. డిజిటల్ పేమెంట్ రంగంలో మోబిక్విక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటివి ఇప్పటికే ఇటువంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి. కాబట్టి మీ ఫోన్‌పే వాలెట్‌ను ఒకసారి చెక్ చేసుకుని, అవసరమైతే ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేసి ఉంచడం మంచిది.
Also Read: UPI యూజర్లకు గుడ్ న్యూస్.. నెట్‌వర్క్, పిన్ లేకుండానే పేమెంట్స్.. ఫోన్ అలా ట్యాప్ చేస్తే చాలు!