E-Paper
Advertisement

iQOO 15R: వచ్చేస్తోంది గేమింగ్ బీస్ట్ ఐకూ 15R.. ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయ్!

iQOO 15R: వచ్చేస్తోంది గేమింగ్ బీస్ట్ ఐకూ 15R.. ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయ్!
Advertisement

iQOO 15R: ప్రముఖ Vivo సబ్ బ్రాండ్ అయిన iQOO ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నేటి యువతను దృష్టిలో పెట్టుకుని గేమింగ్, పెర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఫీచర్లతో రోజురోజుకు కొత్తదనాన్ని పరిచయం చేస్తోంది. గతేడాది iQOO 15 సిరీస్ లాంచ్ అయిన తర్వాత.. ఇప్పుడు iQOO 15R మోడల్ గురించి లీక్స్ వెలువడుతున్నాయి. దీనిని iQOO 15 సిరీస్‌లో మరో వేరియంట్‌గా, మిడ్‌రేంజ్ లేదా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మోడల్‌గా చెబుతున్నారు.

అయితే iQOO 15R ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. ఇటీవల Bluetooth SIG సర్టిఫికేషన్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌‌ఫోన్ మోడల్ నంబర్ I2508. ఇది అధికారికంగా మరికొన్ని నెలల్లో మార్కెట్‌లోకి రానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: అన్ని అంచనాలు దాటేసిన వివో X300 అల్ట్రా.. కెమెరా నుంచి పెర్ఫార్మెన్స్ వరకు అన్నీ సెన్సేషనే!

ఇకపోతే చైనాలో iQOO Z11 Turbo మోడల్‌ రీబ్రాండెడ్ వెర్షన్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌లో iQOO 15R పేరుతో అందుబాటు లోకి రావచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్‌తో ఐకూ 15R రానుందని భావిస్తున్నారు.

Advertisement

లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్న iQOO 15R హ్యాండ్ సెట్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో అద్భుతంగా పనిచేస్తుందని లీక్స్ చెబుతున్నాయి. ఇది
6.78 లేదా 6.82 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1.5K లేదా 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే హై బ్రైట్‌నెస్, HDR సపోర్ట్ ఉండవచ్చు. డ్యూయల్ లేదా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రావైడ్, టెలిఫొటో ఆప్షన్లు. ఫ్రంట్‌లో 16MP లేదా 32MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

iQOO 15R స్మార్ట్‌ఫోన్ 6400mAh లేదా 7000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. ఇది 100W లేదా 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. లాంగ్ బ్యాటరీ లైఫ్, క్విక్ ఛార్జింగ్. 8GB/12GB/16GB RAM, 256GB/512GB స్టోరేజ్ ఆప్షన్లతో రానుంది. ఈ ఫోన్ IP65/IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, స్టీరియో స్పీకర్లు, అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

ఐకూ 15R.. Android 15 లేదా 16 OS మీద రన్ అవుతుంది. ఇక ఈ ఫోన్ డిజైన్ పరంగా చూసుకుంటే.. స్లిమ్ డిజైన్, ప్రీమియం బిల్డ్ (గ్లాస్ లేదా ఫైబర్ బ్యాక్)తో వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఐకూ 15R ధర భారతదేశంలో అంచనాల ప్రకారం.. దాదాపు రూ.40వేల నుంచి రూ.50వేల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Also Read: శాంసంగ్ నుంచి మరో పవర్‌ఫుల్ 5G ఫోన్.. BIS సర్టిఫికేషన్‌తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ కన్ఫర్మ్!

 

 

 

 

 

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×