E-Paper
Advertisement

Viral Video: ’కిడ్నీ అమ్ముకుందామన్నా కుదరలేదు‘.. ప్రాణం తీసుకోవడానికి టవర్ ఎక్కిన బెట్టింగ్ బాధితుడు!

Viral Video: ’కిడ్నీ అమ్ముకుందామన్నా కుదరలేదు‘.. ప్రాణం తీసుకోవడానికి టవర్ ఎక్కిన బెట్టింగ్ బాధితుడు!
Advertisement

Viral Video: నేటి సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సామాజిక మహమ్మారి ఆన్‌లైన్ బెట్టింగ్. క్షణాల్లో కోటీశ్వరులు అయిపోవచ్చనే అత్యాశ, సులభంగా డబ్బు సంసాదించాలనే వ్యామోహం  యవతను పెడదోవ పట్టిస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బుతో సరిపెట్టుకోకుండా.. ఆస్తులు అమ్మకోవడం, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి బెట్టింగ్‌లో పెట్టడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరి కొందరు అయితే ఏకాంగా విచిత్ర చేష్టలు చేస్తూ..  తిరిగి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారిదే తప్పు అని వీరంగం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటనే ఇప్పుడు గుంటూరులో చోటుచేసుకుంది.

అప్పుల ఇచ్చిన వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని కరెంట్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మల్యాపురం గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడి క్రమంగా భారీ మెుత్తంలో నగదు కోల్పోయాడు. రాంబాబు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆన్‌లైన్ బెట్టింగ్ ద్యారా దాదాపు రూ.80లక్షలు నష్టపోయాడు. కొందరు ప్రముఖ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయడం చూసి నమ్మకం పెరిగి.. అదనంగా రూ.60 లక్షలు అప్పు చేసి మరీ బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు చెప్పాడు. తొలుత చిన్న మెుత్తాల లాభాలు కనిపించడంతో మరింత డబ్బు పెట్టేందుకు ప్రోత్సాహం కలిగిందని.. ఆ తర్వాత ఒక్కసారిగా నష్టాలు పెరిగాయని వివరించాడు.

అప్పులు తీర్చలేని పరిస్థితి రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల బాధ తీరేందుకు కిడ్నీ అమ్ముకునే మార్గం ఉందేమోనని కోర్టల చుట్టూ తిరిగినట్లు కూడా చెప్పాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అప్పుల వాళ్లు వేధింపులు పెరిగి.. రోజు రోజుకూ పరిస్థితి మరింత క్షిష్టంగా మారిందని వాపోయాడు.

Advertisement

ఈ ఒత్తిడి తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ కరెంట్ టవర్ ఎక్కనట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×