E-Paper
Advertisement

Vivo iQOO Z11x 5G Phone: భారత్ లో iQOO Z11x 5G ఫోన్ లాంచ్.. ఈ కార్డులపై రూ.2 వేల వరకు ఆఫర్

Vivo iQOO Z11x 5G Phone: భారత్ లో iQOO Z11x 5G ఫోన్ లాంచ్.. ఈ కార్డులపై రూ.2 వేల వరకు ఆఫర్

Vivo iQOO Z11x 5G Phone: వివో సబ్ బ్రాండ్ iQOO Z11x 5G స్మార్ట్ ఫోన్ గురువారం భారత్ మార్కెట్ లో లాంచ్ అయింది. మార్చి 16న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ లో సేల్స్ స్టార్ అవుతాయి. ఈ ఫోన్లు మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు, రెండు కలర్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటాయి. 4nm ప్రాసెస్‌ డిజైన్ తో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్, 7,200mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది.

iQOO Z11x 5G వేరియంట్ల ధర, ఆఫర్లు

భారత్ లో iQOO Z11x 5G 6GB + 128GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్ బేస్ వెర్షన్ ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB RAM, 128GB స్టోరేజ్‌ తో హై-ఎండ్ ఆప్షన్ ఫోన్ ధర రూ. 20,999గా ఉంది. 8GB RAM, 256GB స్టోరేజ్‌ టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధర రూ. 22,999. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ. 2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. iQOO Z11x 5G ప్రిస్మాటిక్ గ్రీన్, టైటాన్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటుంది. 7,100mAh బ్యాటరీ, గేమింగ్ ఆప్టిమైజేషన్లను కలిగి ఉంది.

iQOO Z11x 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా

iQOO Z11x 5G డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్. ఇది Vivo Android 16 బేస్డ్ OriginOS 6 తో పనిచేస్తుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ లపై రెండు ఏళ్ల OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు ఏళ్ల సెక్యురిటీ అప్డేట్స్ ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.76-అంగుళాల LCD స్క్రీన్‌ ఉంటుంది. అలాగే 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 382 ppi పిక్సెల్ సాంద్రత, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 83 శాతం NTSC కలర్ గామట్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP68, IP69+ రేటింగ్‌ ఉంది.

మరిన్ని ఫీచర్లు

  • 4nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌
  • 8GB వరకు LPDDR4x RAM, 256GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్
  • సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌
  • డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌
  • 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2-మెగాపిక్సెల్ బోకె కెమెరా
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 7,200mAh బ్యాటరీ
  • 44W వైర్డు ఫాస్ట్ ఛార్జర్
  • 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్ సపోర్ట్
  • 166.6×78.4×8.4mm కొలతలతో బరువు 219 గ్రాములు

Also Read:  రూ.25 వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, IP69 రేటింగ్‌తో వివో Y51 ప్రో లాంచ్!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×