E-Paper
Advertisement

BEL Recruitment: నవరత్న సంస్థలో భారీ నోటిఫికేషన్.. రూ. 1.40 లక్షల వరకు జీతం

BEL Recruitment: నవరత్న సంస్థలో భారీ నోటిఫికేషన్.. రూ. 1.40 లక్షల వరకు జీతం
Advertisement

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక నవరత్న సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. బెంగళూరు కాంప్లెక్స్‌లోని సెంట్రల్ సర్వీసెస్ విభాగంలో నిర్ణీత కాలపరిమితి ప్రాతిపదికన పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు: మొత్తం 35 డిప్యూటీ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. సివిల్, ఆర్కిటెక్చర్ విభాగాలతో పాటు ఎంఎస్సీ హార్టికల్చర్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ (ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి. ఆర్కిటెక్చర్ విభాగం వారు బి.ఆర్క్ అలాగే హార్టికల్చర్ విభాగం వారు ఎం.ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ మార్కులతో డిగ్రీ పొంది ఉండటం ముఖ్యం. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేవలం పాస్ మార్కులు ఉన్నా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి.

వయోపరిమితి: 2026 మార్చి 1 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 28 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు (PwBD) గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు మినహాయింపు లభిస్తుంది.

Advertisement

జీతం: ఎంపికైన అభ్యర్థులకు అద్భుతమైన వేతన ప్యాకేజీని సంస్థ ఆఫర్ చేస్తోంది. నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు వేతన శ్రేణి ఉంటుంది. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పీఆర్‌పీ వంటి ఇతర భత్యాలు కూడా అందుతాయి. ఈ నియామకాలు ప్రారంభంలో ఐదేళ్ల కాలానికి చేపడతారు. అభ్యర్థి పనితీరు అద్భుతంగా ఉంటే మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష కేవలం బెంగళూరు కేంద్రంలోనే నిర్వహిస్తారని అభ్యర్థులు గమనించాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంది.

చివరి తేది: ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఏప్రిల్ 1వ తేదీ లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

మరిన్ని వివరాలు, సిలబస్, అప్లికేషన్ లింక్ కోసం అభ్యర్థులు www.bel-india.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ALSO READ: Police Recruitment: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో 17,992 పోలీస్ వెకెన్సీలు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×