E-Paper
Advertisement

Nokia, HMD Feature Phones: నోకియా కీప్యాడ్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడొచ్చు!

Nokia, HMD Feature Phones: నోకియా కీప్యాడ్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడొచ్చు!
Advertisement

Nokia, HMD Feature Phones: సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అంటే కేవలం స్మార్ట్‌ఫోన్ల లోనో లేదా ల్యాప్‌టాప్‌ల లోనో ఉంటుందని అనుకుంటాం. కానీ, ఇకపై ఆ పరిస్థితి మారబోతోంది. మన దేశానికి చెందిన సర్వం AI, HMD గ్లోబల్ సంస్థలు చేతులు కలిపి, నోకియా కీప్యాడ్ పోన్లలో స్మార్ట్ ఫీచర్లను అందించబోతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా నోకియా ఫీచర్ ఫోన్లలోకి AI చాట్‌బాట్‌ను తీసుకువస్తున్నట్లు ఈ సంస్థలు ప్రకటించాయి.

సాధారణ ఫోన్లలో అసాధారణ ఫీచర్లు:

ఈ కొత్త ఒప్పందం వల్ల నోకియా, HMD బ్రాండ్ల కీప్యాడ్ ఫోన్లను వాడుతున్న వారు కూడా AI ఫీచర్లను ఎంజాయ్ చేయవచ్చు. ఇకపై కీప్యాడ్ ఫోన్ యూజర్లు కూడా AI చాట్‌బాట్‌తో నేరుగా మాట్లాడొచ్చు. దీంతో ఇంటర్నెట్ వాడకం తెలియని వారు కూడా కేవలం వాయిస్ ద్వారా తమకు కావాల్సిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. ఈ సదుపాయం కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా, కార్లలో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, త్వరలో రాబోయే స్మార్ట్ గ్లాసెస్‌లో కూడా ఈ టెక్నాలజీని వాడాలని సర్వం AI ప్లాన్ చేస్తోంది.

Advertisement

Also Read: వివో నుంచి మరో సంచలనం.. బడ్జెట్ ధరలో 8 Gen 5 ప్రాసెసర్, మైండ్ బ్లాకింగ్ అంతే!

లోకల్ భాషలో AIతో ముచ్చట్లు:

ఈ ఫీచర్‌లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇది ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అంటే.. తెలుగు లేదా ఇతర స్థానిక భాషల్లో ప్రశ్నలు అడిగితే, ఆ చాట్‌బాట్ అదే భాషలో మీకు సమాధానం ఇస్తుంది. ఏయే భాషలు అందుబాటులో ఉంటాయనేది కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించనప్పటికీ, ఇది సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉండబోతోంది. డిజిటల్ టెక్నాలజీకి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ వాయిస్ ఆధారిత AI వరంలా మారనుంది. కేవలం ఫోన్లకే కాకుండా, సర్వం AI సంస్థ సొంతంగా Sarvam Kaze పేరుతో సరికొత్త AI స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా మే నెలలో లాంచ్ చేయబోతోంది.

Advertisement

Also Read: రూ.899 నుంచే ఫిలిప్స్ కొత్త హెడ్‌ఫోన్స్, సౌండ్‌బార్స్.. ఫీచర్స్, క్వాలిటీలో తిరుగులేదు!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×