E-Paper
Advertisement

రాత్రంతా కూలర్ ఆన్ చేసి పడుకుంటున్నారా? తెల్లారేసరికి జరిగేది తెలిస్తే షాకే!

రాత్రంతా కూలర్ ఆన్ చేసి పడుకుంటున్నారా? తెల్లారేసరికి జరిగేది తెలిస్తే షాకే!
Advertisement

Cooler Health Risks: వేసవిలో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఉక్కపోత, వేడి.. చుక్కలు చూపిస్తూ ఉంటాయి. దీంతో చాలా మంది రాత్రిళ్లు హాయిగా నిద్రపోయేందుకు కూలర్లను వినియోగిస్తుంటారు. రాత్రంతా కూలర్ ఆన్ చేసి.. హాయిగా నిద్రిస్తుంటారు. మరి రాత్రంతా కూలర్‌ను రన్ చేయడం సురక్షితమేనా? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? దీనిపై నిపుణుల అభిప్రాయం ఏంటి? ఈ కథనంలో చూద్దాం.

తేమతో కాస్త ఇబ్బందే..

ఎయిర్ కూలర్లు నీటిని ఆవిరి చేయడం ద్వారా చల్లదనాన్ని ఇస్తాయి. కాబట్టి రాత్రంతా కూలర్ నడవడం వల్ల గదిలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల గది చల్లగా అనిపించినప్పటికీ.. కాసేపటికి ఉక్కపోతగా, జిగటగా తయారవుతుందని పేర్కొంటున్నారు.

శ్వాసకోశ సమస్యల ముప్పు

Advertisement

కూలర్ ప్యాడ్లలో నిరంతరం నీరు ఉండటం వల్ల అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ చేరే అవకాశం ఉంది. రాత్రంతా కూలర్ గాలిని పీల్చడం వల్ల.. అలర్జీలు, తుమ్ములు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు

రాత్రంతా కూలర్ నుండి వచ్చే చల్లటి తేమతో కూడిన గాలి.. నేరుగా శరీరంపై పడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెల్లవారేసరికి కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు దీనివల్ల ఇబ్బంది పడతారని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: రిజర్వ్​ చేసిన తీర్పులను.. 3 నెలల్లో వెల్లడించాలి.. హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కూలర్ వాడేటప్పుడు గది కిటికీ లేదా తలుపు కొద్దిగా తెరిచి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గదిలో తేమ పేరుకుపోకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే కూలర్ ట్యాంక్ లోని నీటిని తరచూ మారుస్తూ కూలింగ్ ప్యాడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వీలైతే కూలర్‌కు టైమర్ సెట్ చేసి.. అర్ధరాత్రి తర్వాత కూలర్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా పెట్టుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.

Also Read: రూ.1500 కోట్ల భూమి కబ్జా.. హైదరాబాద్‌లో వైసీపీ నేతపై కేసు.. పరారీలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే!

Related News

రూ.28వేలకే.. 55 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ అంటే ఇలా ఉండాలి

మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఇయర్‌బడ్స్..ఇది నిజంగా సూపర్!

రూ.5,899 ధరకే.. 24 ఇంచుల థామ్సన్ టీవీ!

వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్

స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్..ఏంటీ తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా ?

iPhone 17 దూసుకెళ్తుంటే.. 17e మాత్రం టాప్-5లో లేదు, అసలు కారణం ఇదే!

ప్రొజెక్టర్ డిస్‌ప్లే మసకగా ఉందా? ఈ 4 మార్పులు చేస్తే సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

Big Stories

Advertisement
×