E-Paper
Advertisement

‘సందిగ్ధం’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ అదిరింది కానీ.. ఆ ఒక్కటే మైనస్!

‘సందిగ్ధం’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ అదిరింది కానీ.. ఆ ఒక్కటే మైనస్!
Advertisement

Sandigdham Review: టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో పెద్ద సినిమాల కంటే కంటెంట్ ఓరియెంటెడ్ చిన్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అదే దారిలో వైవిధ్యమైన మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సందిగ్ధం’. తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మించిన ఈ చిత్రానికి పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించారు. నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ లీడ్ రోల్స్ చేయగా.. నెగెటివ్ షేడ్‌లో నవీన్ సంకరపు కనిపించారు. నేడు (మే 29న) రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేరకు థ్రిల్ చేసిందో లేదో రివ్యూలో చూసేద్దాం !

 అసలు కథేంటంటే?

Advertisement

క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ దేవ్ (నిహాల్) చాలా సిన్సియర్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్. తను మేఘన (ప్రియా దేశ్ పాగ్) అనే అమ్మాయితో లవ్‌లో పడతాడు. ఆమె కోసం ఆ ఊరి జనాలకి ఉపయోగపడేలా ఒక పెద్ద హాస్పిటల్ కూడా కట్టిస్తాడు. లైఫ్ అంతా సాఫీగా సాగిపోతున్న టైమ్‌లో.. దేవ్‌కి ఊహించని విధంగా సత్య (అర్జున్ సిహెచ్), కళ్యాణి (కాజల్ తివారి) అనే ఇద్దరు వ్యక్తులు తారసపడతారు. వారికి దేవ్ తన ఇంట్లోనే షెల్టర్ ఇస్తాడు.

అయితే ఇక్కడే అసలైన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ఊర్లో ఉన్న మిగతా జనాలెవరికీ సత్య, కళ్యాణి కనిపించరు.. కేవలం హీరో దేవ్‌కి మాత్రమే కనిపిస్తుంటారు! అసలు ఆ ఇద్దరూ ఎవరు? దేవ్ జీవితంతో వారికి ఉన్న పాత పగ లేదా బంధం ఏంటి? మరోవైపు ఊర్లో చెలామణి అయ్యే వీర (నవీన్ సంకరపు), కోటయ్య, రామరాజు పాత్రల వెనుక ఉన్న డార్క్ సీక్రెట్ ఏంటి? దేవ్ ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు? అనేదే మిగతా కథ.

Advertisement

 సినిమా ఎలా ఉందంటే? 

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఫస్టాఫ్‌లో కథను చాలా నేచురల్‌గా పల్లెటూరి వాతావరణంలో నడిపించారు. హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్ డీసెంట్‌గా ఉంది. ఎప్పుడైతే సస్పెన్స్ క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తాయో అప్పటినుంచి గ్రాఫ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది.
సెకండాఫ్ లో అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా విడిపోతుంటే థ్రిల్ ఫీల్ అవ్వచ్చు. ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి.
సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. అడవులు, కొండ ప్రాంతాల విజువల్స్ విజువల్ ఫీస్ట్‌లా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థ్రిల్లింగ్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది.కాని సినిమా ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. పల్లెటూరి లైఫ్‌ని సహజంగా చూపించే ప్రాసెస్‌లో కథనం కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. కమర్షియల్ హంగులు, మాస్ మసాలా ఎలిమెంట్స్, కామెడీ ట్రాక్స్ ఆశించి వెళ్లే మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. పూర్తిగా సస్పెన్స్ డ్రామాను నమ్ముకోవడంతో కొన్ని చోట్ల సీరియస్‌నెస్ ఎక్కువైంది.

నటీనటుల పర్ఫార్మెన్స్:

దేవ్ పాత్రలో నిహాల్ మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో మంచి ఈజ్ చూపించాడు. హీరోయిన్ ప్రియా దేశ్‌పాగ్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా తన యాక్టింగ్ స్కోప్ ఉన్నంతలో బాగానే చేసింది. ఇక సస్పెన్స్ క్యారెక్టర్స్ చేసిన అర్జున్, కాజల్ తమ నేచురల్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. ‘తెరచేప’ ఫేమ్ నవీన్ సంకరపు విలన్‌గా తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు క్రూరత్వంతో భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు.

 ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ & ఇంటర్వెల్ ట్విస్ట్
  • సెకండాఫ్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

  • స్లో నేరేషన్
  • రొటీన్ కమర్షియాలిటీ మిస్సింగ్

చివరిగా 

రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్ సినిమాలతో బోర్ కొట్టిన వారికి ‘సందిగ్ధం’ ఒక విభిన్నమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని ల్యాగ్ సీన్స్‌ని పక్కన పెడితే.. సెకండాఫ్‌లో వచ్చే సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఈ వీకెండ్‌కి ఒక డిఫరెంట్ మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకుంటే దీనిపై ఒక లుక్కేయొచ్చు.

Sandigdham Review and Rating : 2.5/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×