E-Paper
Advertisement

Room Heater Fire Accident: చలికాలంలో రూం హీటర్లతో అగ్నిప్రమాదాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Room Heater Fire Accident: చలికాలంలో రూం హీటర్లతో అగ్నిప్రమాదాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Advertisement

Room Heater Fire Accident| చలికాలం వచ్చిందంటే ఇంట్లో వెచ్చదనం కోసం రూమ్ హీటర్లు చాలా అవసరమవుతాయి. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు ప్రజలు త్వరగా హీటర్లు కొనడానికి పరుగులు తీస్తారు. కానీ చాలామంది భద్రత గురించి ఆలోచించకుండా తొందరపాటులో కొనుగోలు చేస్తారు. ఈ తొందరలో తీసుకున్న నిర్ణయాల వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ప్రతి చలికాలంలో హీటర్ల వల్ల అగ్నిప్రమాదాలు, విద్యుత్ షాక్‌లు జరుగుతూనే ఉంటాయి. చిన్న పొరపాటు కూడా మీ ఇంటికి పెద్ద నష్టం కలిగిస్తుంది.

బిఐఎస్జ్ జారీ చేసిన హెచ్చరికలు

భారతదేశంలో విద్యుత్ పరికరాల భద్రత ప్రమాణాలు నిర్ణయించే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) రూమ్ హీటర్ల క్వాలిటీ, భద్రతా ప్రమాణాల సూచనలు జారీ చేసింది. హీటర్లు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలని BIS కొనుగోలుదారులకు సూచించింది. నాసిరకం హీటర్ల వల్ల అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షాక్‌లు రావచ్చని హెచ్చరిస్తోంది. సరైన హీటర్ ఎంచుకోవడంతో దాన్ని సరిగ్గా వినియోగించడం చాలా ముఖ్యమని చెబుతోంది.

హీటర్ కొనడానికి ముందు ISI సర్టిఫికేషన్ తప్పక చూడండి

Advertisement

ISI మార్కు ఉన్న హీటర్ భద్రత పరీక్షలు పాస్ అయిందని నిర్ధారిస్తుంది. ఈ పరీక్షల్లో విద్యుత్, మెకానికల్ సెక్యూరిటి ఫీచర్లు పరిశీలిస్తారు. ISI మార్క్ ఉన్న హీటర్లు అగ్ని, షాక్ ప్రమాదాలను తగ్గిస్తాయి. చవకగా కనిపించే నాణ్యత లేని హీటర్లు త్వరగా ప్రమాదాలకు దారితీస్తాయి. సర్టిఫైడ్ హీటర్లు కొనడం వల్ల చలికాలం సురక్షితంగా గడపవచ్చు.

ఆటోమేటిక్ కట్-ఆఫ్ ఫీచర్ చాలా ముఖ్యం

హీటర్ ఎక్కువ వేడెక్కినప్పుడు లేదా పడిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే ఫీచర్ ఉండాలి. ఇది అగ్ని ప్రమాదాలను బాగా తగ్గిస్తుంది. ఈ ఫీచర్ లేకపోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చు. కొనేముందు ఈ భద్రత ఫంక్షన్ ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోండి.

రూమ్ సైజ్‌కి తగిన హీటర్ పవర్ ఎంచుకోండి

Advertisement

గది సైజ్ చూడకుండా హీటర్ కొనడం సరైన నిర్ణయం కాదు. తప్పుడు వాటేజ్ వల్ల ఎక్కువ వేడి, విద్యుత్ ఖర్చు పెరుగుతుంది. తక్కువ పవర్ హీటర్ సరిగ్గా పనిచేయదు, ఎక్కువ పవర్ వైరింగ్‌పై ఒత్తిడి పెడుతుంది. గది ఏరియా బట్టి సరైన వాటేజ్ ఎంచుకోండి. దీనివల్ల ఎనర్జీ సేవింగ్‌ తో పాటు, హీటర్ డ్యామెజ్ కాకుండా నివారించవచ్చు.

సరైన ఎర్తింగ్, ఇన్సులేషన్ చాలా అవసరం

సర్టిఫైడ్ హీటర్లలో మంచి ఎర్తింగ్, ఇన్సులేషన్ ఉంటుంది. ఇవి షాక్, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలను తగ్గిస్తాయి. నాణ్యత లేని హీటర్లలో ఇవి ఉండవు. తక్కువ క్వాలిటీ ఇన్సులేషన్ వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. స్థానిక నాసిరకం ఉత్పత్తులు కొనకండి.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

చవకైన, బ్రాండ్ లేని హీటర్లు కొనవద్దు

తక్కువ ధర మాత్రమే చూసి హీటర్ కొనడం తప్పు. చవక హీటర్లలో సురక్షిత ఫీచర్లు ఉండవు. బ్రాండ్ లేనివి క్వాలిటీ టెస్టింగ్ చేయించవు. కాస్త ఎక్కువ ఖర్చు అయినా సరే నమ్మకమైన బ్రాండ్లు కొనండి. అవి సురక్షిత మార్గదర్శకాలు పాటిస్తాయి.

హీటర్ వైర్లు, ప్లగ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేయండి

హీటర్ ఉపయోగించే ముందు వైర్లు చూడండి. లూజ్ గా ఉంటే స్పార్క్‌లు వచ్చే ప్రమాదం ఉంది. పాడైన ప్లగ్‌లు షాక్ ఇస్తాయి. పాత వైర్లు మార్చండి. ఇలా చేయడం వల్ల అనూహ్య ప్రమాదాలు జరగవు.

సురక్షితంగా హీటర్ ఉపయోగిస్తే మీ కుటుంబం సురక్షితం

చిన్న నిర్లక్ష్యం కూడా ఆస్తి నష్టంతో మీ ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చు. సరైన హీటర్ ఎంచుకుంటే చలికాలం సుఖంగా గడుస్తుంది. BIS మార్గదర్శకాలు కచ్చితంగా పాటించండి. సురక్షిత హీటర్లు ప్రమాదం లేకుండా వెచ్చదనం ఇస్తాయి. మీ కుటుంబాన్ని రక్షించడానికి బాధ్యతాయుతంగా ఎంచుకోండి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×