E-Paper
Advertisement

Free Movies Crime: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

Free Movies Crime: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
Advertisement

Free Movies Crime Pikashow CyberDost Warning | చాలా మంది ఆన్‌లైన్‌లో ఫ్రీగా సినిమాలు చూడడం ఇష్టపడతారు. ఉచితంగా సినిమాలు, వెబ్ సిరీస్ లభించే యాప్‌లు ఉన్నాయి. యూజర్లు అందులో నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేసుకుంటారు. కానీ ఈ అలవాటు యూజర్లను ప్రమాదంలో పడేస్తుంది. ఇండియాలో పైరసీ కంటెంట్ చూడడం నేరం. ఫ్రీ మూవీ యాప్‌లు ఇల్లీగల్ కంటెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల యూజర్లకు చట్టపరమైన, సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లు ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇలా ఉచిత సినిమా కంటెంట్ చూడడం ప్రమాదకరమే కాకుండా చట్ట రీత్యా నేరమని హెచ్చరించింది. అలాంటి వారిపై చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా పికాషో యాప్ ఉపయోగిస్తున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

పికాషో యాప్ గురించి ప్రభుత్వ హెచ్చరిక

భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ విభాగమైన సైబర్‌దోస్త్ ఈ హెచ్చరిక జారీ చేసింది. దీని గురించి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒక అలర్ట్ పోస్ట్ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో భాగమైన సైబర్‌దోస్త్.. సైబర్ సేఫ్టీ అవేర్‌నెస్‌పై ఫోకస్ చేస్తుంది. ఫిషింగ్, మాల్‌వేర్, ఆన్‌లైన్ ఫ్రాడ్ గురించి హెచ్చరిస్తుంది. పికాషో యాప్ ఉపయోగించకూడదని సైబర్‌దోస్త్ హెచ్చరించింది. యూజర్ల వ్యక్తిగత డేటా, సెక్యూరిటీని రిస్క్ చేయొద్దని చెప్పింది. ఫ్రీగా సినిమాలు చూడడం సైబర్, లీగల్ సమస్యలతో కూడకున్నదని వివరించింది.

సైబర్‌దోస్త్ హెచ్చరికలో ఏముంది?

Advertisement

సైబర్‌దోస్త్ అపరిచిత యాప్‌లను ఉపయోగించొద్దని స్పష్టంగా చెప్పింది. పైరేటెడ్ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌ల గురించి హెచ్చరించింది. అలాంటి యాప్‌లు సైబర్ రిస్క్‌లు, లీగల్ ఇష్యూస్ తెస్తాయి. యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఆలోచించమని పోస్ట్‌లో తెలిపింది. పైరసీ నేరమని ప్రధానంగా చెప్పింది. ప్రైవసీ, సెక్యూరిటీని ఎప్పటికీ కాంప్రమైజ్ చేయకూడదని సూచించింది. దేశవ్యాప్తంగా డిజిటల్ యూజర్లను ప్రొటెక్ట్ చేయడమే సైబర్‌దోస్త్ లక్ష్యం.

పికాషో యాప్ ఏమిటి?

పికాషో థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ యాప్. ఫ్రీ మూవీలు, వెబ్ సిరీస్ ఇస్తుంది. లైవ్ టీవీ, స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. స్ట్రీమ్ లేదా డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇందులోని కంటెంట్ కాపీరైట్ చట్టం ఉల్లంఘిస్తుంది.

పికాషో యాప్ ప్రమాదకరం.. ఎందుకంటే

Advertisement

పికాషో యాప్ ప్రమాదకరం. పైరేటెడ్ సినిమాలు ఇందులో ఉంటాయి. ఇందులోని కంటెంట్ ఇల్లీగల్, కాపీరైట్ ఉల్లంఘిస్తుంది. దేశంలో ఈ యాప్ వినియోగదారులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఈ యాప్ ఉపయోగించడం ప్రమాదకరమని, చట్ట వ్యతిరేకమని తెలిసినా చాలా మంది బాధ్యతారాహిత్యంగా వ్యవరహిస్తున్నారు. ఈ యాప్ అఫీషియల్ యాప్ స్టోర్స్‌లో లేదు. అందులో దీన్ని సైట్ల నుంచి లేదా ఇతర అనధికారిక సోర్స్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటే మాల్‌వేర్ రావచ్చు. మీ ఫోన్, ల్యాప్ టాప్, టాబ్లెట్ లో స్పైవేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. మీ యాక్టివిటీస్ అన్నీ సీక్రెట్‌గా సైబర్ మోసగాళ్లు మానిటర్ చేస్తారు.

డేటా, ఫైనాన్షియల్ రిస్క్‌లు

పికాషో యూజర్లు పర్సనల్ డేటా దొంగిలించే అవకాశం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆన్‌లైన్‌లో లీక్ అవుతుంది. హ్యాకర్లు దాన్ని మిస్‌యూజ్ చేస్తారు. సెన్సిటివ్ పర్మిషన్లు యాక్సెస్ చేస్తుంది. మెసేజెస్, కాంటాక్ట్స్ అన్నీ రీడ్ చేస్తుంది. డివైస్ యాక్టివిటీ ట్రాక్ చేస్తుంది. బ్యాంకింగ్, పేమెంట్ ఇన్ఫో లీక్ అవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగి మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు చోరి అయ్యే ప్రమాదం ఉంది.

Also Read: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

యూజర్లపై చట్టపరమైన చర్యలు

పైరేటెడ్ కంటెంట్ చూడడం చట్టపరంగా నేరం. భారత చట్ట ప్రకారం పైరసీకి శిక్షలు ఉన్నాయి. యూజర్లు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నోటీసులు లేదా పెనాల్టీలు వేసే అవకాశం ఉంది. సీరియస్ కేసుల్లో ప్రాసిక్యూషన్ జరుగవచ్చు. పైరసీ కంటెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటే మీకు ఎక్కువ రిస్క్ ఇస్తుంది.

ఆన్‌లైన్‌లో మీ భద్రత చాలా ముఖ్యం

అపరిచిత సోర్సెస్ నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయకూడదు. అఫీషియల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు మాత్రమే ఉపయోగించండి. పెయిడ్ ప్లాట్‌ఫామ్స్ మంచి సెక్యూరిటీ ఇస్తాయి. యాప్ పర్మిషన్లు జాగ్రత్తగా చెక్ చేయండి. ట్రస్టెడ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయండి. సైబర్ మోసం జరిగితే వెంటనే రిపోర్ట్ చేయండి. సేఫ్ బ్రౌజింగ్ డేటా, డివైస్‌లను ప్రొటెక్ట్ చేస్తుంది.

 

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×