E-Paper
Advertisement

itel A90 mobile: ఐటెల్ ఏ90 లిమిటెడ్ ఎడిషన్ … కేవలం రూ.7,299లకి అప్‌డేటెడ్ లుక్‌తో అదిరిపోయే మోడల్

itel A90 mobile: ఐటెల్ ఏ90 లిమిటెడ్ ఎడిషన్ … కేవలం రూ.7,299లకి అప్‌డేటెడ్ లుక్‌తో అదిరిపోయే మోడల్
Advertisement

itel A90 mobile: టెక్ మార్కెట్ కొత్త టెక్నాలజీతో వేగంగా మారుతోంది. ఒకప్పుడు ఎక్కువ ధరల్లో మాత్రమే కనిపించే ఫీచర్లు ఇప్పుడు బడ్జెట్ రేంజ్‌కే చేరుతున్నాయి. ఫోన్ల విషయానికి వస్తే ఇప్పుడు యూజర్లు ఎక్కువగా ఫీచర్లనే చూస్తున్నారు. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లో టెక్ మార్కెట్ ఐటెల్ ఎ90 లిమిటెడ్ ఎడిషన్ అడుగుపెట్టింది. ఈ ఫోన్ ఫీచర్లు బడ్జెట్‌కి మించి ఉన్నట్టు అనిపిస్తాయి. రోజూ జేబులో పెట్టుకునే వారికైనా, ఎక్కువసేపు చేతిలో ఉంచుకునే వారికైనా ఈ లుక్ ప్రీమియంగా అనిపిస్తుంది.

6.6 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే

Advertisement

ఐటల్ ఈ మోడల్‌లో ఇచ్చిన 6.6 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే రోజు మొత్తం కళ్లకు హాయిగా ఉండే విధంగా పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఈ ధరలో ఇవ్వడం మంచి బెనిఫిట్. స్క్రీన్‌పై చేసే ప్రతి కదలిక స్మూత్‌గా కనిపిస్తుంది. యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా, సోషల్ మీడియా స్క్రోలు చేస్తున్నా, రీల్స్ చూస్తున్నా విజువల్స్ చాలా ఫ్లూయిడ్‌గా ఉంటాయి. బయట సూర్యకాంతి ఉన్నప్పటికీ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ తగ్గకుండా చదవడానికి సరిపోయేలా ఉంటుంది. ఎక్కువసేపు స్క్రీన్ చూస్తూ ఉండే విద్యార్థులకైనా, రోజు మొత్తం ఫోన్‌పై టైమ్ స్పెండ్ చేసే యూజర్లకైనా ఇది సరైన అనుభవం ఇస్తుంది.

128జిబి స్టోరేజ్

Advertisement

ఐటెల్ ఫోన్ పర్‌‌ఫార్మెన్స్‌లో తన స్థాయిని స్పష్టంగా చూపిస్తుంది. యూనిసోక్ టి7100 ఆక్తాకోర్ ప్రాసెసర్ 2.2GHz స్పీడ్‌తో రోజువారీ పనులన్నీ స్థిరంగా నడిపిస్తుంది. ఈ రేంజ్‌లో 12జిబి వరకు ర్యామ్ అనుభవం ఇవ్వడం నిజంగా ప్రత్యేకం. 4జిబి యాక్చువల్ ర్యామ్‌తో పాటు 8జిబి వర్చువల్ ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ మరింత సులభమవుతుంది. ఒకేసారి యాప్‌లు ఓపెన్ చేసినా ఫోన్ స్లో కాకుండా నడుస్తుంది.128జిబి స్టోరేజ్ ఇవ్వడం ఈ మోడల్‌కు మరింత బలం జతచేస్తుంది.

13ఎంపి కెమెరా స్లైడింగ్ జూమ్ సపోర్ట్‌

కెమెరా విభాగంలో కూడా ఈ ఫోన్ ఈ రేంజ్‌లో తనకంటూ ఒక స్థాయి కట్టుకుంది. వెనుక ఇచ్చిన 13ఎంపి కెమెరా స్లైడింగ్ జూమ్ సపోర్ట్‌తో ఫోటోలు బాగా తీసుకురాగలదు. డేలైట్‌లో తీసిన ఫోటోలు స్పష్టంగా, వివరాలతో కనిపిస్తాయి. పోర్ట్రెట్ మోడ్‌లో సబ్జెక్ట్ సపరేషన్ కూడా బాగా ఉంటుంది. ఫ్రంట్ 8ఎంపి కెమెరా సెటప్ సెల్ఫీలలో సహజమైన రంగులతో క్లీన్‌గా ఉంటుంది. వీడియో కాల్స్ చేసే సమయంలో కూడా ఫ్రంట్ కెమెరా స్పష్టత తగ్గకుండా ఉంటుంది.

5000mAh బ్యాటరీ

బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. 5000mAh బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం పనిచేయగలదు. సోషల్ మీడియా వాడినా, వీడియోలు చూసినా, కాల్స్ చేసినా బ్యాటరీ స్థిరంగా ఉంటుంది. బాక్స్‌లో 10W ఛార్జర్ ఇచ్చినా, ఫోన్ 15W వరకు సపోర్ట్ చేయడం వల్ల ఛార్జింగ్ కొంచెం ఫాస్ట్‌గా పూర్తవుతుంది. రోజూ బయట తిరిగే యూజర్‌లైనా, విద్యార్థులైనా, ఈ ఫోన్ బ్యాటరీ తమ అవసరాలకు తగినంతగా వస్తుంది.

Also Read: Wobble 1 Smartphone: ఇండియాలో వొబుల్ 1 ఫోన్ ఎంట్రీ.. ధర చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. ఎంతంటే?

ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ సాఫ్ట్‌వేర్

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ పై రన్ అవుతుంది. గో ఎడిషన్ కావడంతో ఒఎస్ తేలికగా, వేగంగా పనిచేస్తుంది. అనవసరమైన యాప్‌లు తక్కువగా ఉండటం వల్ల యూఐ ఎప్పుడూ స్మూత్‌గా ఉంటుంది. కొత్తగా ఫోన్ వాడే యూజర్లకైనా ఇది చాలా సులభంగా ఉపయోగించగలిగే విధంగా ఉంటుంది.

మిస్ ఎస్టీడి 810హెచ్ సర్టిఫికేషన్

డ్యూరబిలిటీ విషయంలో ఐటల్ ఈ మోడల్‌కు నిజంగా మంచి బలం ఇచ్చింది. మిస్ ఎస్టీడి 810హెచ్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల ఐసీసిడెంటల్ డ్రాప్స్ వచ్చినా, జేబులో నుంచి జారిపోయినా ఫోన్ పెద్దగా నష్టం కాకుండా తట్టుకుంటుంది. పైగా ఐపి54 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి చినుకులు నుంచి రక్షణ లభిస్తుంది. బడ్జెట్ రేంజ్‌లో ఇలాంటి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇవ్వడం చాలా అరుదు, కానీ ఐటల్ ఈ మోడల్‌లో ఆ స్థాయి బలాన్ని అందించింది.

కనెక్టివిటీ – సెక్యూరిటీ

కనెక్టివిటీ విభాగంలో డ్యూయల్ 4జి వోల్ట్, వైఫై, బ్లూటూత్ 5 అన్నీ ఉండటం వల్ల రోజువారీ అవసరాలు సులభంగా నెరవేరతాయి. వాయిస్ కాల్స్ క్లియర్‌గా వినిపిస్తాయి. నెట్‌వర్క్ స్టేబిలిటీ కూడా బాగానే ఉంటుంది. ఆడియో సెక్షన్‌లో డిటిఎస్ సౌండ్ ఉండటం ఫోన్ స్పీకర్ నుండి వచ్చే శబ్దాన్ని ఇంకా శుభ్రంగా వినిపించేలా చేస్తుంది. 3.5mm హెడ్ఫోన్ జాక్ ఇవ్వడం కూడా వైర్డ్ ఆడియో వాడే వారికి ఎక్ట్రా బెనిఫిట్ అనిచెప్పొచ్చు. ఫింగర్‌ ప్రింట్ వేగంగా స్పందిస్తుంది. ఫేస్ అన్‌లాక్ కూడా వెలుతురు ఉన్నప్పుడు వెంటనే పని చేస్తుంది.

ఇండియాలో ధర

ధర విషయానికి వస్తే. భారతదేశంలో ఐటల్ ధర కేవలం రూ.7,299 మాత్రమే. ఈ ఫోన్ ఆఫర్లలో అందుబాటులో కూడా ఉంది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో నిజంగా ఒక పర్‌ఫెక్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. తక్కువ ధరలో హై ఫీచర్లు ఉన్న ఫోన్ అంటే ఐటల్ అని చెప్పొచ్చు.ప్రీమియం అనుభవం కావాలని కోరుకునే వారికి ఇది సరైన్ ఫోన్ అవుతుంది.

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×