E-Paper
Advertisement

Thalaivar 173: రజనీకాంత్‌ను మేం హర్ట్ చేయలేం… సుందర్ తప్పుకోవడంపై కమల్ సంచలన కామెంట్

Thalaivar 173: రజనీకాంత్‌ను మేం హర్ట్ చేయలేం… సుందర్ తప్పుకోవడంపై కమల్ సంచలన కామెంట్
Advertisement

Thalaivar 173: కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth)ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. గత వారం రోజుల క్రితం రజనీకాంత్ మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan)నిర్మాణంలో రజనీకాంత్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇలా తలైవర్ 173 (Thalaivar 173)సినిమా గురించి అధికారక ప్రకటన రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుందర్ సి(Sundar.c) దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారకంగా వెల్లడించడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే వారం రోజులు గడవకముందే ఈ సినిమా నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

రజనీకాంత్ ను బాధ పెట్టలేం..

ఈ సినిమాకు సుందర్ దర్శకత్వం వహించడం లేదని ఆయన ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే తన వ్యక్తిగత, అనివార్య కారణాల వల్ల తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు సుందర్ అధికారకంగా వెల్లడించారు. తాజాగా ఈ విషయం గురించి నటుడు కమల్ హాసన్ మొదటి సారి స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ డైరెక్టర్ సుందర్ సి ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై తన స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని అనుకొని కారణాలవల్లే తప్పుకున్నారని తెలిపారు. అయితే నేను నిర్మాతను కాబట్టి నా హీరో రజనీకాంత్ గారిని హార్ట్ చేయకుండా తనని సంతృప్తపరిచే సినిమానే నిర్మించాలని భావిస్తున్నాను.

రజనీకాంత్ గారి కోసం మరో కథ..

Advertisement

రజనీకాంత్ గారు పూర్తిగా కథల పరంగా సంతృప్తి చెందే వరకు మేము ఎన్నో స్క్రిప్టులను వింటూనే ఉంటామని, మేము కలిసి పని చేస్తున్న సినిమాకు మరొక మంచి కథ కోసం వెతుకుతున్నాము అంటూ ఈ సందర్భంగా కమల్ హాసన్ తలైవర్ 173 గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. మరి కమల్ హాసన్ రజనీకాంత్ సినిమాలో తదుపరి దర్శకుడిగా ఎవరు భాగం కాబోతున్నారు? ఏంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

కుష్బూపై విమర్శలు..

Advertisement

ఇక ఈ సినిమా నుంచి డైరెక్టర్ సుందర్ తప్పుకోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ సుందర్ భార్య నటి కుష్బూ (Kushboo)ని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమాలో కుష్బూ గారిని ఐటమ్ సాంగ్ చేయమని అడిగి ఉంటారు అందుకే డైరెక్టర్ తప్పుకున్నారు అంటూ విమర్శలు రావడంతో ఈ విమర్శలపై కుష్బూ కూడా ఘాటుగా స్పందించారు. నన్ను ఐటెం సాంగ్ చేయమని ఎవరు అడగలేదు.. మీ కుటుంబంలో ఎవరినైనా చేయమన్నారేమో అనుకున్నా అంటూ కుష్బూ తనపై వచ్చిన ట్రోల్స్ కు గట్టిగా సమాధానం ఇచ్చారు. ఈ బిగ్ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ తప్పుకోవడంతో కుష్బూపై కూడా విమర్శలు వస్తున్నాయి. తాజాగా కమల్ హాసన్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదాలన్నింటికీ పులి స్టాప్ పెట్టినట్టే అయిందని చెప్పాలి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×