E-Paper
Advertisement

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన.. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన.. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
Advertisement

Jio Plans: ప్రముఖ టెలికాం సంస్థ జియో తన యూజర్ల కోసం అనేక రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో 3 నెలల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్స్ ను అత్యధిక మంది రీఛార్జ్ చేసుకుంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 84 రోజుల వ్యాలిడిటీతో జియో అందిస్తున్న చౌకైన ప్లాన్స్, వాటిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు లభించే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ.369 రీఛార్జ్ ప్లాన్..

జియో భారత్ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న వారి కోసం అత్యంత చౌకైన రూ.369 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్.. అపరిమిత కాల్స్ తో పాటు ప్రతీ రోజూ 0.5GB డేటాను అందిస్తుంది. అలాగే ప్రతీ 28 రోజులకు 300 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ చేసుకుంటే రోజుకు 4.39 మాత్రమే యూజర్ కు ఖర్చు కానుంది.

రూ. 448 రీఛార్జ్ ప్లాన్..

Advertisement

డేటాతో పనిలేకుండా కేవలం అపరిమిత కాల్స్ మాత్రమే కోరుకునేవారికి కోసం జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్.. అపరిమిత కాల్స్ తో పాటు 1000 SMSలను ప్లాన్ కాలానికి అందిస్తుంది. అలాగే జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్ ఉచిత సబ్ స్క్రిప్షన్లను అదనపు ప్రయోజనాల కింద పొందవచ్చు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు రూ.5.33 మాత్రమే ఖర్చు అవుతుంది.

రూ.799 రీఛార్జ్ ప్లాన్..

84 రోజుల వ్యాలిడిటీతో బేసిక్ ఆల్ రౌండ్ ప్లాన్ కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. ఈ ప్లాన్ కింద యూజర్ ప్రతీరోజూ 1.5GB హై స్పీడ్ డేటా, రోజుకు 100SMSలు లభిస్తాయి. అలాగే జియో ఏఐ క్లౌడ్ (Jio AI Cloud), జియో టీవీ (Jio TV), రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ అదనపు ప్రయోజనాల కింద పొందవచ్చు. ఈ ప్లాన్ కింద రోజుకు రూ.9.51 ఖర్చు అవుతుంది.

Advertisement

Also Read: మధ్యతరగతి స్పెషల్.. అకాయ్ నుంచి బడ్జెట్ ఏసీలు లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్ భయ్యా!

రూ.859 రీఛార్జ్ ప్లాన్..

ఇది కేవలం డేటాను ఉద్దేశించి తీసుకొచ్చిన ప్లాన్. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ కింద.. యూజర్ కు ప్రతీరోజూ 2GB డేటా లభిస్తుంది. ప్లాన్ పూర్తయ్యే సమయానికి 168 GB ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు 100SMSలు, డేటా కోటా పూర్తి అయితే 64Kbps స్పీడ్ తో అపరిమిత డేటా పొందవచ్చు. ప్లాన్ చేసుకుంటే రోజుకు రూ.10.22 భారం పడుతుంది.

Also Read: AC Water Tips: ఏసీ నీటిని వృథా చేస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ లాభాలన్నీ మిస్ అవుతారు!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×