E-Paper
Advertisement

మధ్యతరగతి స్పెషల్.. అకాయ్ నుంచి బడ్జెట్ ఏసీలు లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్ భయ్యా!

మధ్యతరగతి స్పెషల్.. అకాయ్ నుంచి బడ్జెట్ ఏసీలు లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్ భయ్యా!
Advertisement

Akai NXT AC: దేశంలో నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Akai (అకాయ్) నయా ఏసీలను లాంచ్ చేసింది. తన సరికొత్త ‘NXT’ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ (AC) సిరీస్‌ను విడుదల చేసింది. ఈ కొత్త రేంజ్ ACలు.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) సూచించిన 2026 ఎనర్జీ రేటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.

3 ప్రత్యేక సిరీస్‌లు లాంచ్..

అకాయ్ కంపెనీ.. ఈ NXT వెర్షన్‌లో మూడు రకాల మోడళ్లను పరిచయం చేసింది. నీలగిరి, కాశ్మీర్, సియాచిన్ వంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల పేర్లను ఈ మోడళ్లకు పెట్టింది. నీలగిరి (Nilgiree) మోడల్.. బడ్జెట్ ధరలో లభించే బేసిక్ వేరియంట్. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఇది తక్కువ సామర్థ్యం కలిగి ఉండి.. విద్యుత్ ఆదాపై ఎక్కువ దృష్టి పెడుతుంది.

కాశ్మీర్, సియాచిన్ మోడల్స్..

Advertisement

‘హాట్ అండ్ కోల్డ్’ ఇన్వర్టర్ ఏసీలుగా కాశ్మీర్ (Kaashmir) మోడల్ ను అకాయ్ రూపొందించింది. ఇవి వేసవిలో చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తూ ఏడాది పొడవునా సమర్థవంతంగా పనిచేయనున్నాయి. ఇక సియాచిన్ (Siaachen) వేరియంట్ ను NXT వెర్షన్‌ సిరీస్ లోనే ప్రీమియం మోడల్ గా అకాయ్ తీర్చిదిద్దింది. బయటి ఉష్ణోగ్రత 55°C ఉన్నప్పటికీ గదిని సమర్థవంతంగా చల్లబరుస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

ఏసీల్లోని ప్రధాన ఫీచర్లు..

2026 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన BEE 2026 రేటింగ్ ఆధారంగా ఈ అకాయ్ ఏసీలు రూపొందాయి. ఇవి కఠినమైన విద్యుత్ ఆదా నిబంధనలకు అనుగుణంగా పనిచేయనున్నాయి. అకాయ్ తన నెక్ట్స్ సిరీస్ ఏసీలను 3 స్టార్, 5 స్టార్ రేటింగ్స్ తో అందుబాటులో తీసుకొచ్చింది. వీటిలోని 9-ఇన్-1 మోడ్స్ ఉపయోగించి.. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా కూలింగ్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ఆయుర్వేదిక్ ఫిల్టర్

Advertisement

అకాయ్ నెక్ట్స్ సిరీస్ ఇన్వర్టర్ ఏసీలు.. స్వచ్ఛమైన చల్లటి గాలిని అందిస్తాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. గాలిలోని బ్యాక్టీరియా, వైరస్ లను తొలగించి శుభ్రమైన గాలిని అందించడానికి ఇందులో యాంటీ-వైరల్ ఆయుర్వేదిక్ ఫిల్టర్లను (Ayurvedic filters) ఉపయోగించినట్లు తెలిపాయి. మరోవైపు తేమ వల్ల గ్యాస్ లీకేజీలు జరగకుండా బ్లూ ఫిన్ టెక్నాలజీతో కూడిన లక్కర్ ప్రొటెక్షన్ ఈ ఏసీలకు అందించారు.

Also Read: AC Water Tips: ఏసీ నీటిని వృథా చేస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ లాభాలన్నీ మిస్ అవుతారు!

ధర ఎంతంటే?

అకాయ్ తన నెక్ట్స్ సిరీస్ ఇన్వర్టర్ ఏసీలను 1 టన్, 1.5 టన్, 2 టన్ వేరియంట్లలో లాంచ్ చేసింది. ప్రారంభ ధరను దాదాపు రూ.35,490 గా నిర్ణయించింది. ఈ సరికొత్త ఏసీలు.. దేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్లతో పాటు అకాయ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Also Read: Airtel Plans: దుమ్మురేపుతున్న టాప్ 2 ప్లాన్స్.. అవి ఏంటి? రెండింటిలో ఏది బెస్ట్?

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×