E-Paper
Advertisement

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!
Advertisement

Jio Plans: దేశంలోని ప్రముఖ టెలికాం రంగ సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు జియో.. ఎన్నో రకాల ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులో ఉంచింది. ప్రధానంగా సామాన్యుల కోసం రూ.350లోపు బడ్జెట్ లోనూ చౌకైన వాటిని తీసుకొచ్చింది. వాటిలో యూజర్లను ఆకట్టుకుంటున్న టాప్ – 5 ప్లాన్లు, వాటి వల్ల లభించే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 349 ప్లాన్

జియో బడ్జెట్ సెగ్మెంట్ లో అత్యంత ప్రజాధరణ పొందిన ప్లాన్లలో ఇదీ ఒకటి. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ప్రతీ రోజూ 2GB హైస్పీడ్ డేటా యూజర్లకు లభించనుంది. మీ ఏరియాలో జియో 5G నెట్ వర్క్, 5G ఫోన్ ఉంటే.. అపరిమితంగా 5G డేటాను పొందొచ్చు.

రూ. 299 ప్లాన్

Advertisement

రూ.349 పోలిస్తే ఈ ప్లాన్ లో తక్కువ డేటా లభించనుంది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో రోజుకు 1.5GB డేటా యూజర్ కు అందించనున్నారు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు యథావిధిగా కొనసాగనున్నాయి.

రూ.249 ప్లాన్

డేటాతో పెద్దగా అవసరం లేని వారి కోసం జియో ఈ మంత్లీ ప్లాన్ ను తీసుకొచ్చింది. 28 వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ 1GB డేటా యూజర్ కు లభించనుంది. ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, అర్హులైన కస్టమర్లకు 5G అపరిమిత డేటా ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

రూ.239 ప్లాన్

Advertisement

జియో ఈ ప్లాన్ ను 22 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద యూజర్లకు ప్రతీ రోజూ 1.5GB డేటా లభించనుంది. ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.

Also Read: ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

రూ.209 ప్లాన్

22 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ రోజుకు 1GB డేటాను యూజర్లకు అందిస్తుంది. దేశంలోని ఏ నెట్ వర్క్ కైనా ఫ్రీగా కాల్స్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. అలాగే ప్రతీ 100 ఎస్ఎంఎస్ లు చెప్పున 2200 మెసేజ్ లు ప్లాన్ కాలంలో యూజర్లు పంపుకోవచ్చు.

Also Read: అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

Related News

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

Big Stories

Advertisement
×