E-Paper
Advertisement

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!
Advertisement

Uday Krishna Reddy: మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో గల ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

మహిళా ట్రైనీ అధికారి పై లైంగిక దాడి..

Advertisement

నేషనల్ పోలీస్ అకాడమీ-NPA లో శిక్షణ పొందుతున్న ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి, తనను కృష్ణారెడ్డి లైంగికంగా వేధించాడంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారుల శిక్షణ కేంద్రంలో ఇలాంటి ఘటన జరగడం, కేసు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలు రావడంతో.. నేషనల్ పోలీస్ అకాడమీ ఉదయ్ కృష్ణారెడ్డిని సెలవుపై పంపించేసింది. అకాడమీకి చెందిన ప్రివిలేజ్ కమిటీ- CCTV ఫుటేజ్‌లతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించింది. మహిళా ట్రైనీ ఆరోపణల్లో నిజం ఉందని కమిటీ గుర్తించి, ఆయనను అకాడమీ నుంచి పంపించాలని సిఫార్సు చేసింది.

హీరో టు జీరో..

Advertisement

ఉదయ్ కృష్ణారెడ్డి- కెరీర్‌ పరిస్థితేంటి? జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చిన కృష్ణారెడ్డి విజయగాథ.. ఆయన ఐపీఎస్ గా ఛార్జ్ తీసుకోకుండానే ముగిసిపోతుందా? అయితే ఈ విషయంలో.. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ తుదినిర్ణయం తీసుకోవల్సి ఉందంటున్నారు అధికారులు.

రియల్ లైఫ్ స్టోరీ..

కృష్ణారెడ్డి రియల్ లైఫ్ స్టోరీ ఫక్తు సినిమా ఫక్కీలో ఉంటుంది. సినిమా కష్టాల్లాంటివి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆయనకు ఐదేళ్ల వయసులో తల్లి మరణించగా.. 17 ఏళ్ల వయసులో డ్రైవర్ గా పని చేసిన తండ్రి మరణించారు. దీంతో కృష్ణారెడ్డి తన నాయనమ్మ రమణమ్మ దగ్గరే, ఎక్కువగా గడపాల్సి వచ్చింది.

కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా..

పేపర్ బాయ్ గా, కావలిలోని ఒక ల్యాబ్ లో టెక్నీషియన్ గా పార్ట్ టైం జాబ్ చేశారు కృష్ణారెడ్డి. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికై- ప్రకాశం జిల్లా, గుడ్లూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ కోసం సమయం దొరుకుతుందని కోస్టల్ సెక్యూరిటీ విభాగానికి బదిలీపై వెళ్లారు. అక్కడ ఒక CI తోటి సిబ్బంది ముందు ఉదయ్ కృష్ణారెడ్డిని తీవ్రంగా అవమానించి, శిక్షగా గంటకు పైగా అదనపు డ్రిల్ చేయించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేకనే 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2024 లో విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆయన తన 5వ ప్రయత్నంలో ఆల్ ఇండియా 350వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యారు. దీంతో కృష్ణారెడ్డి సివిల్స్ రాసే ఎందరో అభ్యర్ధులకు ఒక స్ఫూర్తిగా నిలిచారు.

Also Read: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

శానిటైజర్ తాగా ఆత్మహత్య..

కృష్ణారెడ్డి గతం ఎంత నిజమో ప్రస్తుతం ఆయనపై వచ్చిన ఆరోపణలు కూడా అంతే నిజమని అంటున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణికి వాట్సాప్‌లో అశ్లీల మెసేజ్‌లు పంపడం, ఆమె పర్సనల్ వీడియో రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి ఆరోపణలపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×