E-Paper
Advertisement

Jio Plans: రూ.198, రూ.199 ప్లాన్స్.. తేడా ఒక్క రూపాయే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు!

Jio Plans: రూ.198, రూ.199 ప్లాన్స్.. తేడా ఒక్క రూపాయే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు!
Advertisement

Jio Plans: దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. అయితే రూ.200లోపు బడ్డెట్ లో తీసుకొచ్చిన రెండు ప్లాన్స్ ను యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కరూపాయి తేడాతో తీసుకొచ్చిన రూ.198, రూ.199 ప్లాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే రూపాయి తేడాతో వచ్చిన ఈ ప్లాన్స్ మధ్య వ్యత్యాసాల పరంగా ఎంత తేడా ఉందన్న చర్చ సహజంగానే ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో ప్లాన్స్ మధ్య తేడాలు? ప్రయోజనాల పరంగా ఏది మెరుగైనది? ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ. 198 ప్లాన్

ఈ ప్లాన్ ను ప్రధానంగా హెవీ డేటా యూజర్ల కోసం జియో తీసుకొచ్చింది. తక్కువ కాలపరిమితి ఉన్నా.. రోజువారీ డేటా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. 14 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే.. ప్రతీరోజూ 2GB డేటా పొందొచ్చు. అంటే మొత్తం 14 రోజులకు గాను 28 GB డేటా వస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.

రూ. 199 ప్లాన్

Advertisement

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునేవారికి ఈ ప్లాన్ సరైన ఎంపికగా నిలుస్తుంది. కేవలం ఒక రూపాయి అదనంగా చెల్లించడం ద్వారా రూ.198 ప్లాన్ తో పోలిస్తే 4 రోజులు అదనంగా వ్యాలిడిటీ పొందొచ్చు. అంటే 18 రోజులపాటు ఈ ప్లాన్ బెనిఫిట్స్ యూజర్ కు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ కింద రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. అంటే మొత్తం 18 రోజులకు గాను 27 GB డేటా యూజర్ పొందొచ్చు. ఇందులోనూ అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు ఫ్రీగా చేసుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

రెండు ప్లాన్స్ లోనూ జియో తన అనుబంధ యాప్స్ అయిన జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల వినియోగదారులు సినిమాలు, టీవీ షోలు, క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని పొందొచ్చు. అయితే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఈ ప్లాన్స్ లో ఉండవు. కేవలం సాధారణ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read: SIM Validity: రీఛార్జ్ చేయకుండా.. సిమ్‌ను ఎన్ని రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చో తెలుసా?

ఫైనల్గా ఏది ఎంచుకుంటే బెటర్?

రోజువారీ ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉండి తక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్నా పర్వాలేదని భావిస్తే.. రూ.198 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అలాకాకుండా మీకు డేటా కంటే కాల్స్ ఎక్కువ రోజులు మాట్లాడాలి, ప్లాన్ త్వరగా ముగియకూడదని అనుకుంటే రూ.199 ప్లాన్ చేసుకోవచ్చు. 4 రోజుల అదనపు టాక్ టైమ్ లభించడం దీనిలో పెద్ద అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు.

Also Read: ఐఫోన్ ఊరికే హీట్ ఎక్కుతోందా? వీటి వల్లే కావొచ్చు.. ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×