E-Paper
Advertisement

Nasser Hussain: రూ.100 కోట్లు కాదు, బాబ‌ర్ ఆజం కాళ్లు ప‌ట్టుకున్నా..ఐపీఎల్ లోకి రాడు

Nasser Hussain:  రూ.100 కోట్లు కాదు, బాబ‌ర్ ఆజం కాళ్లు ప‌ట్టుకున్నా..ఐపీఎల్ లోకి రాడు
Advertisement

Nasser Hussain:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament), PSL ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చాలా గొప్పదంటూ పదే పదే చెబుతున్నారు. ఫిక్సింగ్, వివాదాలు, తప్పుడు నిర్ణయాలు ఇలా ఎన్నో రకాల సంఘటనలు ఐపీఎల్లో మాత్రమే జరుగుతాయని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను ( Pakistan Super League 2026 Tournament) ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాసర్ హుస్సేన్ ( Nasser Hussain). ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ బెటర్ అన్నారు. 100 కోట్లు కాదు, బాబర్ ఆజం కాళ్లు పట్టుకొని బతిలాడినా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి అతడు రాబోడని బాంబు పేల్చారు. పాకిస్తాన్ కోసమే బాబర్ ఆజం ( babar azam) చివరి వరకు ఆడతాడని.. ఐపీఎల్ లో అస్సలు అడుగుపెట్టబోడని నాసర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నాసర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: PSLలో (Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2) మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

రూ.100 కోట్లు కాదు, బాబ‌ర్ ఆజం కాళ్లు ప‌ట్టుకున్నా..ఐపీఎల్ లోకి రాడు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బాబర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన బాబర్ ఆజం, 588 పరుగులు సాధించాడు. ఇందులో అతని బ్యాటింగ్ యావరేజ్ 84 కాగా.. స్ట్రైక్ రేట్ 146 గా ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా రెండు సెంచరీలు నమోదు చేసిన బాబర్ ఆజం, మూడు అర్థ సెంచరీలు కూడా చేశారు. ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తున్న బాబర్ ఆజంను ఉద్దేశించి నాసర్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజం.. ఐపీఎల్ టోర్నమెంటులో ఆడాలని ఇండియన్స్ కోరుతున్నారని బాంబు పేల్చారు. కానీ ఐపీఎల్ లో ఆడేందుకు బాబర్ ఆజం సుముఖంగా లేడని తెలిపారు. 100 కోట్లు ఇచ్చినా కూడా ఆ టోర్నమెంటులోకి వెళ్లబోడని షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాబర్ ఆజం ప్రదర్శన పైన పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ కూడా ఇలాగే స్పందించాడు. గత రెండు సంవత్సరాల లో విఫలమైన బాబర్ ఆజం, ఈసారి అద్భుతంగా రానిస్తున్నాడని ప్రశంసించారు. ఇదే ఊపుతో దూసుకు వెళ్తాడని కొనియాడారు. అతి త్వరలోనే పాకిస్తాన్ కెప్టెన్ కూడా అవుతాడని బాబర్ ఆజంను ప్రశంసించారు తన్వీర్ అహ్మద్. అంతేకాదు 2027 వన్డే వరల్డ్ కప్ కూడా పాకిస్తాన్ గెలుస్తుందని.. అదికూడా కెప్టెన్ బాబర్ ఆజం ఆధ్వర్యంలోనే వ‌ర‌ల్డ్ క‌ప్ రావ‌డం గ్యారెంటీ అంటూ ప్ర‌క‌ట‌న చేశారు త‌న్వీర్ అహ్మ‌ద్.

Advertisement

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్ Ramiz Raja Hug

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×