E-Paper
Advertisement

Jio vs Airtel: జియో రూ.339 ప్లాన్.. ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్.. రెండింటిలో ఏది బెస్ట్?

Jio vs Airtel: జియో రూ.339 ప్లాన్.. ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్.. రెండింటిలో ఏది బెస్ట్?
Advertisement

Jio vs Airtel: ప్రముఖ టెలికాం సంస్థ జియో కొత్తగా తన యూజర్ల కోసం రూ.339 ప్రీపెయిడ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో మెరుగైన ప్రయోజనాలను కోరుకునేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని జియో వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మరో దిగ్గజ సంస్థ ఎయిర్ టెల్ సైతం ఇంచుమించుగా ఇదే ధరతో రూ.379 ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జియో తీసుకొచ్చిన ప్లాన్.. ఎయిర్ టెల్ కంటే మెరుగైనదా? కాదా? అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం.

జియో రూ.339 ప్లాన్ ప్రయోజనాలు..

జియో ఈ ప్లాన్ ను 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. సాధారణంగా చాలా వరకూ టెలికాం సంస్థలు మంత్లీ ప్లాన్స్ ను 28 రోజులకు అందిస్తుండగా.. జియో మాత్రం పూర్తి నెలకు దీనిని తీసుకురావడం విశేషం. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్.. రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు పొందనున్నారు. అలాగే రూ.14.95 టాక్ టైమ్ కూడా లభించనుంది. అదనంగా రూ.35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో 18 నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు.

ఎయిర్ టెల్ రూ.379 ప్లాన్..

Advertisement

ఎయిర్ టెల్ ప్లాన్ విషయానికి వస్తే.. ఇది కూడా 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. ప్రతీరోజూ 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు యూజర్ కు లభించనున్నాయి. అలాగే యాపిల్ మ్యూజిక్, 30 GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్, 12 నెలల కాలానికి అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్, ఫ్రీ హలో ట్యూన్స్ అదనపు ప్రయోజనాల కింద యూజర్ వినియోగించుకోవచ్చు.

Also Read: Mijia Split AC: షావోమీ పవర్‌ఫుల్ ఏసీ లాంచ్.. 15 సెకన్లలోనే కూలింగ్.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు భయ్యా!

రెండింటిలో ఏ ప్లాన్ బెస్ట్?

Advertisement

పైన పేర్కొన్న ప్లాన్స్ ధరలు దాదాపుగా సమానంగా ఉన్నప్పటికీ అవి అందిస్తున్న సేవల్లో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తోంది. జియో ప్లాన్ ధర కాస్త తక్కువగా ఉండటంతో పాటు జెమినీ ప్రో సబ్ స్క్రిప్షన్, రోజుకు 1.5GB డేటా అందిస్తోంది. ఎయిర్ టెల్ ప్లాన్ రూ.379 ఉన్నప్పటికీ.. రోజుకు 2GB డేటా ఇవ్వడం వల్ల ఆ తేడాను భర్తీ చేయవచ్చు. ఓవరాల్ గా చూస్తే యూజర్ తన అవసరాలు, యాడ్ ఆన్ ప్యాక్స్ బెన్ ఫిట్స్ లో ఏది ప్రయోజనకరంగా ఉన్నాయో సరిచూసుకొని దానిని ఎంచుకుంటే బెటర్.

Also Read: Viral News: ప్రియుడి కోసం భర్త, కొడుకుని వదిలేసింది.. ఆ తర్వాత కారులో ప్రియుడితో మూడుముళ్లు

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×