Karnataka: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్లుగా వివాహ బంధంలో ఉన్న ఓ గృహిణి మనసు చంపుకోలేకపోయింది. చివరకు తన ఏడేళ్ల కొడుకు, భర్తను వదిలిపెట్టింది. కోరుకున్న ప్రియుడ్ని కారులో వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలో విచిత్రమైన ఘటన వెలుగులోకి
హాసన్ జిల్లా అరకల్గూడ్ తాలూకాలోని ముండగోడు గ్రామానికి చెందిన హర్షిత-ముకందూర్ గ్రామానికి చెందిన ప్రకాష్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. సరిగ్గా 2017లో పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హర్షితకు వరసకు ప్రకాశ్ బావ అవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దగ్గరి బంధువు. ఈ దంపతులకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు.
గత నెల మార్చి 30న ఆసుపత్రికి వెళ్తానంటూ ఇంటి నుండి బయలుదేరింది హర్షిత. ఆ తర్వాత ఆమె తిరిగి రాలేదు. కూతురు కనిపించపోవడంతో హర్షిత తల్లిదండ్రులు హాసన్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షిత ఆచూకీ కనుగొని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే భర్త ప్రకాష్‌తో వెళ్లడానికి నిరాకరించింది హర్షిత.
ప్రియుడి కోసం భర్త, కొడుకుని వదిలేసింది.. కారులోనే ప్రియుడితో మూడుముళ్లు
తాను కోరుకున్న ప్రియుడి సచిన్‌తో వెళ్తానని మొండికేసింది. పోలీసులు ఆమెని రిలీఫ్ సెంటర్‌కు తరలించారు. తనకు ఒంట్లో బాగోలేదని చెప్పి ఆసుపత్రికి వెళ్తునంటూ అక్కడి నుంచి బయలు దేరింది. ఈలోగా ప్రియుడ్ని ఫలానా చోటుకు రప్పించి కారులోపల పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వ్యవహారం ఆమె తల్లిదండ్రుల దృష్టికి వెళ్లింది.
దీంతో హర్షితపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇంటి నుంచి వెళ్లిన సమయంలో సుమారు 32 లక్షల విలువైన బంగారం, 8 లక్షల నగదు తీసుకుని వెళ్లిపోయిందని ఆరోపించారు. పెళ్లయిన వారం రోజులకు ఆమె ప్రవర్తనపై అనుమానాలు వచ్చాయని అంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆమె ఈ విధంగా ప్రవర్తించిందని అంటున్నారు.
ALSO READ: ఎరక్కపోయి ఇరుక్కుపోవడమంటే ఇదే.. గంటలపాటు నరకయాతన
తాము ముత్యంలా చూసుకున్న కోడలు మమ్మల్ని వదిలి వెళ్లిపోయిందని, ఒకవేళ తిరిగి వచ్చినా తాము అంగీకరించేది లేదని అత్తింటివారు తెగేసి చెప్పారు. ఇక హర్షిత వెర్షన్‌కు వద్దాం. వీడియో వైరల్‌పై రియాక్ట్ అయ్యింది. తాను 18 ఏళ్ల వయస్సులో తాను పెళ్లి చేసుకున్నానని తెలిపింది. భర్త ఇంట్లో ఆస్తి సమస్యల వల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పింది.
ప్రతీరోజు తాగి వచ్చి హింసించి కొట్టేవాడని భర్త ప్రకాష్, ఆయన కుటుంబం మీద ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ద్వారా సచిన్ అనే వ్యక్తిని కలిశానని, ఆ తర్వాత ప్రేమలో పడ్డానని తెలిపింది. అతడ్ని కోల్పోతానేమోనన్న భయంతో తనకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని వెల్లడించింది.
Woman leaves husband, marries lover | ಗಂಡನನ್ನ ಬಿಟ್ಟು ಪ್ರಿಯಕರನಿಂದ
ತಾಳಿ ಕಟ್ಟಿಸಿಕೊಂಡ ಮಹಿಳೆ
..
.
.#ViralNews #RelationshipDrama #ShockingNews #TrendingShorts #KarnatakaNews #CrimeFiles #MarriageTwist #LoveStory #TrendingVideo
ಹಾಸನ pic.twitter.com/5SKxePAT1q— Sanjevani News (@sanjevaniNews) April 13, 2026