Amaravati Capital: ఏపీకి రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. అయినా వైసీపీ మాత్రం రాజధానిపై కన్ఫ్యూజన్ పెంచడానికే ప్రయతిస్తోంది. జగన్ మావిగన్ ప్రతిపాదనలో మరోసారి వైసీపీ ముఖ్యనేతల తీరు ఆ పార్టీ శ్రేణులకే అంతుపట్టకుండా తయారైందంట. జగన్ ప్రతిపాదించిన మావిగన్ ను ప్రజల్లో ఎలా తీసుకువెళ్లాలని ఆ పార్టీ నేతలకు ఉత్తర్వలు జారీ అయ్యాయంట. దాంతో వైసీపీ ముఖ్యలంతా మావిగాన్ జనం మొదలు పెట్టారంట. అయితే కూటమి పార్టీల నుంచి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వస్తున్న విమర్శల దాడిని ఎదుర్కొంటూ… ఏం చెప్పి ప్రజల మద్దతు కూడకట్టాలని తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారంట.
ఏపీకి అమరావతి రాజధాని ఏకైక రాజధాని అంటే వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేక పోతున్నారు. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని కేంద్ర ప్రభుత్వ గెజిట్ కూడా వచ్చింది. అంటే రాజధానిగా అమరావతిని మార్చాలని చూడటం దుస్సాహసమే. అయినా వైసీపీ మాత్రం అమరావతిపై తన అక్కసు వెల్లగక్కుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైన వైసీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు సూపర్ అంది. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ సైతం.. అమరావతి రాజధానికి ఆమోదం తెలిపారు. తీరా అధికారంలోకి వచ్చాక అదే జగన్ ప్లేటు ఫిరాయించారు. అభివృద్ది వికేంద్రీకరణ పేరులో మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నారు. రాష్ట్రం నడిబొడ్డున ఉండి, అన్ని జాల్లాల వారి రాకపోకలకు అందుబాటులో ఉన్న అమరావతిని ఏకైక రాజధానిగా ఉండటమేంటని.. విశాఖ, కర్నూలులను తెలపైకి తెచ్చి… హడావుడి చేశారు.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధానని విచిత్రమైన వాదన వినిపించారు. విశాఖే ఏపీ రాజధానని, అక్కడి నుంచే పరిపాలిస్తానని ఆర్భాటంగా ప్రకటించారు. మళ్లీ తనదే అన్న ధీమాతో రుషికొండను తొలిచేసి పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నారు. తీరా చూస్తే జగన్ గత ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా లేక.. దాని కోసం యాగీ చేస్తూ.. అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయాల్సిన స్థితి తెలత్తింది. అటు చస్తే ఏపీకి అమారవతి ఏకైక రాజధానని కూటమి ప్రభుత్వం అధికారిక ముద్ర వేయించుకుంది. అంటే ఇక అమరావతిని రాజధానిగా మర్చడం రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా అసాధ్యమే. ఆ క్రమంలో జగన్ ప్లాన్-బి అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చి.. మావిగాన్ రాజధాని అంటున్నారు. అసలు ఆ ప్రతిపాదన తెచ్చినప్పుడే యావత్తు తెలుగా ప్రజలు.. ఆశ్చర్యపోయి, ఇదేం పేరని సెటైర్లు మొదలుపెట్టారు. మావిగన్ అంటే
‘మా’నసిక ‘వి’ కలాంగుడు ‘జ’గన్ అని ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read: సెంటిమెంట్ పేరుకోసం కేటీఆర్ వర్సెస్ కవిత.. గులాబీ కోటలో కొత్త రాజకీయం!
ఆ నెగిటివ్ ఎఫెక్ట్‌తో జగన్ పార్టీ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే పార్టీ నేతలందర్నీ మావిగాన్ ప్రతిసాదన అద్భతమని జగన్ ఆదేశించారంట. జగన్ చెప్పిందే వేదమని భావించే పార్టీ నేతలు మావిగన్‌పై పాజిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. వైసీపీలో జగన్ కంటే ఎంతో మంది సీనియర్ పొలిటీషియన్లు ఉన్నారు. చిత్రమేంటంటే అమరావతి కంటే మావిగాన్‌కి జనాల మద్దతు ఉందని వైసీపీ నేతలు భ్రమిస్తూ.. అదే ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. వైసీపీ నేతల మావిగన్ ప్రచారం అతి పెద్ద ట్రోల్ కంటెంట్ గా మారి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అవుతోంది. వారి వాదనతో పాజిటివిటీ కంటే నెగిటివిటీ వ్యాప్తి చెందుతోందంటున్నారు. కానీ వైసీపీ మాత్రం మావిగాన్ ప్రతిపాదనపై జనాలు పెద్ద ఎత్తున ఆదరణ కనబరుస్తున్నారని, అందుకే టీడీపీలో వణుకు పుడుతోందని ప్రచారం చేసుకుంటోంది. అయితే మావిగాన్ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం తెలిసినా తెలియనట్లుగా అంతా బాగానే ఉంది తమ డిమాండ్ కి మద్దతు లభిస్తోందని చెప్పుకుని ఆత్మ సంతృప్తి చెందుతోందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వైసీపీ గత వారం పది రోజులుగా మావిగాన్‌ని ఒక బలమైన స్లోగన్ గా, తమకు దాని వల్ల వేయి రెట్లు రాజకీయ బలం వచ్చినట్లుగా చేసుకుంటున్న ప్రచారాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఇది రాజధాని ఎంపిక సమయం కాదని అంతా అంటున్న మాట. ఇక అమరావతికి రాజధాని చట్టబద్ధత వచ్చి నిర్మాణాలు వేగంగా సాగుతున్న వేళ వైసీపీ వింత పోకడలతో. కొత్త ప్రతిపాదనలతో సెల్ఫ్ గోల్ చేసుకుంటూ, అంతో ఇంతో ఉన్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. వాస్తవానికి జగన్ ప్రతిపాదించి మావిగన్ ప్రాంతమంతా సీఆర్డీఏ పరిధిలో ఉంది. అయితే జగన్ ప్రతిపాదిస్తున్న రాజధాని మాత్రం చుట్టు పక్కల ఊళ్లతో పనిలేకుండా.. ఇప్పటికే రియల్ బూమ్ నడుస్తున్న నేషనల్ హైవే ప్రాంతాల్లో ఉండటం విశేషం. అమరావతిపై కమ్మ వర్గీయుల ముద్ర వేస్తున్న వైసీపీ అధ్యక్షుడు, మచిలీపట్నాన్ని రాజధానిగా ప్రతిపాదిస్తే వ్యతిరేకత వస్తుందని, ఈ మావిగన్ ప్రపోజల్ పెట్టారంటున్నారు విశ్లేషకలు. అక్కడ కాపు సామాజికవర్గం గణనీయంగా ఉండటంలో వారిని ఆకట్టుకోవడానికే.. కుల రాజకీయం మొదలు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. కాపులు అధికంగా ఉన్న ప్రాంతం మచిలీపట్నాన్ని టీడీపీ అందుకే వ్యతిరేకిస్తోందని వైసీపీ శ్రేణులు స్థానికంగా ప్రచారం మొదలుపెట్టాయి.
మొత్తానికి వైసీపీ ఎంతగా మావిగాన్ అని ప్రచారం చేసుకుంటూ పోతే, అంతలా రాజకీయ నష్టం ఉంటుందని, వారు ప్రతిపాదించినమావిగాన్ ప్రాంతంలో రాజకీయంగా వైసీపీకి ఒరిగేది ఏమీ ఉండదని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ రాజధాని విషయంలో తరచూ స్టాండ్ మార్చుకోవడం కొత్త పేర్లతో జనంలోకి రావడం వైసీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదంట. ఆ క్రమంలో.. అమరావతి దేవతల రాజధాని అని కూటమి ప్రభుత్వం, అక్కడి ప్రజలు చేసుకుంటున్న ప్రచారాన్ని జీర్ణించుకోలేక.. ఊరుపేరు లేని ‘మావిగన్’ను ఫోకస్ చేస్తుంన్నారన్న సెటైర్లు పెరిగిపోతున్నాయి.
Also Read: Mohsin Naqvi: పెట్రోల్ కోసం ఇండియాలో జనాలు కొట్టుకుచస్తున్నారు..మా పాకిస్తాన్ లో ఆ పరిస్థితి లేదు