Arjun Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్ లు ఉండగా, ఆ తర్వాత ప్లే ఆఫ్స్, అనంతరం ఫైనల్ ఉండనుంది. అంటే సరిగ్గా మరో 10 రోజుల్లో ఐపీఎల్ టోర్నమెంట్ ఫినిష్ కానుంది. అయితే ఈ టోర్నమెంట్లో ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants ) ఎలిమినేట్ అయింది. అయినప్పటికీ కూడా క్రికెట్ దిగ్గజం సచిన్ ( Sachin) టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు (Arjun Tendulkar) సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఇవ్వడం లేదు. గతంలో అంబానీ ఫ్యామిలీ ( Ambani Family) వ్యవహరించిన తరహాలోనే.. అర్జున్ టెండూల్కర్ ను అవమానిస్తోంది లక్నో యాజమాన్యం. లేటెస్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ లో కూడా అతన్ని దారుణంగా అవమానించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ( Mumbai indians ) నుంచి అర్జున్ టెండూల్కర్ ను ట్రేడింగ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. శార్దుల్ ఠాకూర్ ను ముంబైకి ఇచ్చేసింది లక్నో. దీంతో లక్నో జట్టులో కచ్చితంగా అర్జున్ టెండూల్కర్ కు అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. కానీ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు వాటర్ బాయ్ గానే అర్జున్ టెండూల్కర్ ను ట్రీట్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. సారా టెండూల్కర్ ( Sara Tendulkar), సానియా చందోక్ ( saaniya chandok), అంజలి టెండూల్కర్ ( Anjali Tendulkar) లాంటి వాళ్లు లక్నో మ్యాచ్ చూసేందుకు వచ్చిన సమయంలో కూడా.. వాటర్ బాయ్ గానే ( Water Boy) అర్జున్ టెండూల్కర్ కనిపించాడు. తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే అర్జున్ టెండూల్కర్ పరువు తీసింది లక్నో యాజమాన్యం.
అయినప్పటికీ అన్ని దిగమింగుకొని, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా మరోసారి అర్జున్ టెండూల్కర్ ను దారుణంగా అవమానించింది లక్నో. ప్రిన్స్ యాదవ్ ( Prince Yadav) టీమిండియా కు సెలెక్ట్ అయిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ లో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది లక్నో యాజమాన్యం. ఈ సందర్భంగా ప్లేయర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారు. కానీ అర్జున్ టెండూల్కర్ ను ఎవరు పట్టించుకోలేదు. అతన్ని డ్రెస్సింగ్ రూమ్ లో కూడా లక్నో వెలివేసింది. యాజమాన్యంతో పాటు లక్నో ప్లేయర్లు కూడా… అర్జున్ టెండూల్కర్ ను చాలా చీప్ గా చూస్తున్నారట. అందుకే కేక్ కటింగ్ కార్యక్రమంలో కూడా సైడ్ అయిపోయాడు అర్జున్. ఈ క్రమంలోనే అతని ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన సచిన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. వెంటనే లక్నో నుంచి అర్జున్ బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
Feel for Arjun Tendulkar 💔
Yesterday, LSG cut a cake to celebrate Prince Yadav’s maiden India call-up, but on the other side, Arjun Tendulkar was just standing there without any emotions.
There was no happiness or joy on his face. It looked like he was completely devastated… pic.twitter.com/5vuikNG5n5
— Indian Cricket Ministry (@ICM_News45) May 20, 2026