E-Paper
Advertisement

Aadarsha Kutumbam: ‘ ఆదర్శ కుటుంబం’గా వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా టైటిల్.. పోస్టర్ వైరల్!

Aadarsha Kutumbam: ‘ ఆదర్శ కుటుంబం’గా వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా టైటిల్.. పోస్టర్ వైరల్!
Advertisement

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఇప్పటివరకు 76 సినిమాలలో హీరోగా నటించిన ప్రేక్షకులను సందడి చేశారు. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) దర్శకత్వంలో తన 77వ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా నటించిన బోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి ఇక ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారు అనే విషయంపై ఎన్నో రకాల సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలన్నింటికీ పెడుతూ చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు “ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47” (Aadarsha Kutumbam house No 47)అనే టైటిల్ ప్రకటిస్తూ ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమాని 2026 సమ్మర్లో విడుదల చేసే విధంగా చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ చూస్తుంటే కనుక ఇది ఒక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుందని స్పష్టమవతుంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా AK 47..

Advertisement

ఇక ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఎంపిక అయ్యారు. అదేవిధంగా ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారని అయితే ఈమె పూర్తిగా నెగిటివ్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారంటూ కూడా ఇదివరకు వార్తలు వచ్చాయి. మరి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Advertisement

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా అనంతరం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త సినిమాకు కమిట్ అవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి. త్రివిక్రమ్ కథా రచయితగా మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలలో వెంకటేష్ నటించిన కానీ దర్శకుడిగా ఇది మొదటి సినిమా కావటం విశేషం. అయితే నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి సినిమాలు కూడా ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ క్యామియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Also Read: Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా ఉండటం అసలు ఇష్టం లేదు.. సీజన్ 10 కి నాగార్జున ఉండరా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×