E-Paper
Advertisement

Kodak 65-inch Mini QD TV: భారీ డిస్కౌంట్‌తో కోడాక్ మినీ క్యూడీ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Kodak 65-inch Mini QD TV: భారీ డిస్కౌంట్‌తో కోడాక్ మినీ క్యూడీ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Kodak 65-inch Mini QD TV: ఖరీదైన ప్రీమియం ఫీచర్లను బడ్జెట్ ధరలో అందించే ప్రముఖ కోడాక్ సంస్థ.. తాజాగా ఇండియన్ మార్కెట్లోకి తమ సరికొత్త Mini QD టీవీని విడుదల చేసింది. 65 అంగుళాల భారీ స్క్రీన్‌తో వచ్చిన ఈ టీవీ, అత్యాధునిక మినీ ఎల్‌ఈడీ, క్వాంటం డాట్ టెక్నాలజీల కాంబినేషన్‌తో రూపొందింది. సాధారణంగా ఇలాంటి ఫీచర్లు ఉన్న టీవీలు రూ.లక్ష‌కు పైగా ధర పలుకుతుంటాయి. కానీ కోడాక్ దీనిని సామాన్యులకు అందుబాటులో ఉండేలా తీసుకురావడం గొప్ప విషయం అనే చెప్పాలి.

అద్భుతమైన విజువల్స్..

ఈ Mini QD TV ప్రధాన ఆకర్షణ దీని డిస్‌ప్లే. 1500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో పగటి వెలుతురులో కూడా పిక్చర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీ వాడటం వల్ల రంగులు సహజంగా ఉండటమే కాకుండా, చీకటి సీన్లలో కూడా వివరాలు చాలా క్లియర్ గా తెలుస్తాయి. డాల్బీ విజన్, HDR10 సపోర్ట్‌తో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందవచ్చు.

Advertisement

Also Read: వాట్సప్ అదిరిపోయే అప్డేట్.. ఈ గోల్డెన్ ఛాన్స్ ఐఫోన్ యూజర్లకు మాత్రమే!

సౌండ్‌బార్ అక్కర్లేదు..

చాలా టీవీల్లో పిక్చర్ బాగున్నా సౌండ్ విషయంలో కాస్త నిరాశ చెందుతుంటాం. కానీ కోడాక్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనిలో 108 వాట్స్ అవుట్‌పుట్ ఇచ్చే ఆరు స్పీకర్లను అమర్చారు. అలాగే సబ్‌ వూఫర్లు, స్కై సబ్‌ వూఫర్లు ఉండటం వల్ల డాల్బీ అట్మోస్ సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. బయట విడిగా సౌండ్ బార్ కొనే అవసరం లేకుండానే.. బేస్, క్లారిటీతో కూడిన ఆడియోను ఈ టీవీ అందిస్తుంది.

అత్యాధునిక ఫీచర్లు..

Advertisement

నేటి యువతను ఆకట్టుకునేలా గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, VRR వంటి ఫీచర్లను దీనిలో చేర్చారు. గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి వేలకొద్దీ యాప్స్ సులభంగా వాడుకోవచ్చు. మీడియాటెక్ ప్రాసెసర్, 2GB RAM వల్ల యాప్స్ స్విచ్చింగ్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటుంది.

 బ్యాంక్ ఆఫర్ వివరాలు:

ప్రస్తుతం ఈ 65 అంగుళాల వేరియంట్ అమెజాన్‌లో రూ.54,999కు అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరో రూ.3,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రీమియం ఫీచర్లు కలిగి ఉండి, తక్కువ బడ్జెట్‌లో పెద్ద టీవీ కొనాలనుకునే వారికి ఈ కోడాక్ మినీ QD TV బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

Also Read: ఈ సమయాల్లో ఏసీ వేయొద్దు.. అలా చేస్తే ఈ రెండు నష్టాలు తప్పవు!

Related News

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×