Best Time to Use AC: ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందాలంటే ఏసీ అనేది విలాసం కాదు.. అవసరంగా మారిపోయింది. అయితే, ఏ సమయంలో ఏసీ వాడాలో తెలియక చాలామంది వేలకు వేలు కరెంటు బిల్లులు చెల్లిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని టిప్స్ పాటిస్తే.. సరైన సమయంలో ఏసీని ఉపయోగించడం వల్ల ఇల్లు చల్లగా ఉండటమే కాకుండా.. మీ జేబుకు కూడా భారం తగ్గుతుంది.
మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేస్తే.. గది చల్లబడటానికి చాలా సమయం పడుతుంది. దీంతో కరెంటు ఎక్కువగా ఖర్చవుతుంది. అందుకే ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో బయట ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పుడు ఏసీని ఆన్ చేయడం మంచిది. అలాగే, గదిలోని చల్లదనం బయటకు పోకుండా తలుపులు, కిటికీలు మూసేయాలి. ఏసీ ఉష్ణోగ్రతను 24 నుండి 26 డిగ్రీల మధ్య ఉంచడం వల్ల గది చల్లగా ఉండటమే కాకుండా.. కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ఈ సమయంలో ఫ్యాన్ ఆన్ చేస్తే.. ఆ చల్లని గాలి గది మొత్తం వ్యాపించేలా చేయవచ్చు.
Also Read: వచ్చేసింది సరికొత్త పెన్సిల్ క్లీనర్.. నిమిషాల్లో మీ ఇళ్లంతా ఊడ్చి, తడిగుడ్డ పెట్టేస్తుంది!
విద్యుత్ ఆదా చేయాలంటే మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఏసీ వాడొద్దు. దానికి బదులు ఉదయమే ఏసీతో గదిని చల్లబరిచి, మధ్యాహ్నం కేవలం ఫ్యాన్లతో ఆ కూలింగ్‌ను కంటిన్యూ చేయొచ్చు. ఇన్వర్టర్ ఏసీలను వాడటం వల్ల గది ఉష్ణోగ్రతను బట్టి అవి పనితీరును మార్చుకుని తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. అలాగే స్మార్ట్ థర్మోస్టాట్లు వాడితే మన అవసరానికి తగ్గట్టుగా ఏసీని షెడ్యూల్ చేయొచ్చు. మనం ఇంట్లో లేనప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు ఆటోమేటిక్‌గా టెంపరేచర్ మారేలా సెట్ చేసుకుంటే సరిపోతుంది..
కేవలం ఏసీ మీదనే ఆధారపడకుండా.. కిటికీలకు కర్టెన్లు లేదా బ్లైండ్స్ వేయడం ద్వారా సూర్యరశ్మి నేరుగా ఇంట్లోకి రాకుండా చూడవచ్చు. ఇది గది వేడెక్కకుండా అడ్డుకుంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు డీహ్యూమిడిఫైయర్లను వాడితే గది త్వరగా చల్లబడుతుంది. ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం వల్ల కూడా సహజంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
Also Read: బ్లూటూత్ యుగంలోనూ వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌కు తగ్గని క్రేజ్.. అసలు కారణాలు తెలిస్తే?