E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో.. లేటెస్ట్ ఫోన్ కొనాలా? రూ.10వేలలోపు టాప్ మొబైల్స్

తక్కువ బడ్జెట్‌లో.. లేటెస్ట్ ఫోన్ కొనాలా? రూ.10వేలలోపు టాప్ మొబైల్స్
Advertisement

Best mobiles under 10000: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు మంచి ఫీచర్లు, ఫాస్ట్ ఇంటర్నెట్ కావాలంటే భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో మొబైల్ బ్రాండ్లు తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ. 10వేల లోపు ఉండి, మంచి లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీ, లేటెస్ట్ ఫీచర్లు ఉన్న మొబైల్ కోసం చూస్తుంటే… ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఆప్షన్స్, వాటి స్పెసిఫికేషన్లు ,ధరల పూర్తి వివరాలు మీ కోసం.

1. షియోమి రెడ్‌మి 14C 5G (Xiaomi Redmi 14C 5G):
రెడ్‌మి బ్రాండ్ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ మార్కెట్లో బాగా దూసుకుపోతోంది. ఇది తక్కువ ధరలో అద్భుతమైన 5G పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

Advertisement

ఫీచర్లు: ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. అలాగే 6.88 ఇంచుల లార్జ్ 120Hz డిస్‌ప్లే ఉండటం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ , వీడియోలకు బెస్ట్ అని చెప్పాలి. దీనిలో 50 MP మెయిన్ కెమెరా , 5160 mAh బ్యాటరీ ఇచ్చారు.

ధర: రూ.9,499 (4GB RAM / 64GB స్టోరేజ్)

Advertisement

2. మోటో జీ35 5G (Moto G35 5G):
మీకు ఫోన్ లో ఎలాంటి బగ్స్ లేదా అనవసరమైన యాడ్స్ లేకుండా క్లీన్ సాఫ్ట్‌వేర్ ఫీల్ కావాలనుకుంటే మోటోరోలా బెస్ట్ ఆప్షన్.

ఫీచర్లు: ఈ ఫోన్ యూనిసాక్ T760 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో 6.72 ఇంచుల FHD+ 120Hz డిస్‌ప్లే ఉంది. ఇది ఈ బడ్జెట్‌లో చాలా రేర్ ఫీచర్. అంతేకాకుండా 50 MP + 8 MP డ్యూయల్ రీరర్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ దీని ప్రత్యేకతలు.

ధర: రూ. 9,999 (4GB RAM/128GB స్టోరేజ్)

3. శామ్‌సంగ్ గెలాక్సీ F06 5G (Samsung Galaxy F06 5G):
చాలా మంది చైనీస్ బ్రాండ్లు కాకుండా బ్రాండ్ వాల్యూ , నమ్మకమైన సాఫ్ట్‌వేర్ క్వాలిటీ కోరుకుంటారు. అలాంటి వారికి శామ్‌సంగ్ బెస్ట్ చాయిస్.

ఫీచర్లు: ఇందులో మీడియాటెక్ డిమెన్సిటీ 6300 పవర్‌ఫుల్ 5G ప్రాసెసర్ ఉంది. 6.7 ఇంచుల 90Hz డిస్‌ప్లే, 50 MP మెయిన్ కెమెరా , 5000 mAh బ్యాటరీతో వస్తుంది. శామ్‌సంగ్ బ్రాండ్ నమ్మకం, లాంగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ దీని ప్లస్ పాయింట్.

ధర: రూ. 9,799 (4GB RAM/64GB స్టోరేజ్)

4. పోకో C75 5G (POCO C75 5G):
పోకో ఫోన్లు ఎప్పుడూ స్పీడ్ , గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇష్టపడే యూత్ ను టార్గెట్ చేస్తాయి.

ఫీచర్లు: ఈ లేటెస్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో చాలా స్నాప్పీగా పనిచేస్తుంది. మల్టీటాస్కింగ్, యూపీఐ పేమెంట్స్, సోషల్ మీడియా యాప్స్ వాడటానికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీని డిజైన్ కూడా చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

ధర: రూ.8,299 (4GB RAM/64GB స్టోరేజ్)

5. వీవో T3 లైట్ 5G (Vivo T3 Lite 5G):
కెమెరా , స్టైలిష్ లుక్ కోరుకునే వారికి వీవో నుంచి వచ్చిన ఈ మోడల్ ఒక సూపర్ ఆప్షన్.

ఫీచర్లు: ఇందులో మీడియాటెక్ డిమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. 6.56 ఇంచుల డిస్‌ప్లే, 50 MP మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఇది మంచి ఫోటోలను అందిస్తుంది.

ధర: రూ.9,774 (4GB RAM / 128GB స్టోరేజ్)

Also Read: డిష్‌వాషర్ కొనాలనుకుంటున్నారా? ఇండియన్ కిచెన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే బెస్ట్ ఆప్షన్స్!

కొనేముందు గుర్తుంచుకోవాల్సిన  విషయాలు:
రూ. 10,000 లోపు ఫోన్లలో మనం హెవీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడటం కష్టం. అలాగే నైట్ టైమ్ కెమెరా క్వాలిటీ యావరేజ్‌గా ఉంటుంది. మీరు ఫోన్‌ను నార్మల్ యూసేజ్, వాట్సాప్, యూట్యూబ్, ఆన్‌లైన్ క్లాసులు , సోషల్ మీడియా కోసం వాడుకోవాలనుకుంటే ఇవి వంద శాతం పర్ఫెక్ట్ గా సరిపోతాయి.

మొత్తంగా చూస్తే, ప్రైస్, ఫీచర్లను బేరీజు వేసుకుంటే ప్రస్తుతం రూ.10,000 బడ్జెట్ లోనే 5G సపోర్ట్ ఉన్న ఫోన్లు దొరకడం పెద్ద ప్లస్ పాయింట్. మీకు క్లీన్ సాఫ్ట్‌వేర్ కావాలంటే మోటోరోలా, ఎక్కువ స్టోరేజ్ , బిగ్ స్క్రీన్ కావాలంటే రెడ్‌మి, బ్రాండ్ నమ్మకం కావాలంటే శామ్‌సంగ్ బ్రాండ్లను ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ సేల్స్ , బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఇవి ఇంకా తక్కువ ధరకే దొరికే అవకాశం ఉంది.

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×