E-Paper
Advertisement

భారత మార్కెట్లోకి యూనో మిండా 3 ఛానల్ డాష్‌ క్యామ్.. 5 ఆసక్తికర విశేషాలు మీకోసం!

భారత మార్కెట్లోకి యూనో మిండా 3 ఛానల్ డాష్‌ క్యామ్.. 5 ఆసక్తికర విశేషాలు మీకోసం!
Advertisement

Uno Minda New 3-Channel Dashcam: భారత్ లో డాష్‌ క్యామ్‌ ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ టైమ్ లో ఆధారాలు అవసరం కావడంతో చాలా మంది ఇప్పుడు తమ కార్లలో డాష్‌ క్యామ్‌ లను ఫిక్స్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూనో మిండా కొత్త 3 ఛానల్ డాష్‌ క్యామ్‌ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది కారు ముందు, వెనుక, క్యాబిన్ లోపల రికార్డింగ్ చేస్తుంది. కొత్త ఫీచర్లతో వచ్చిన ఈ డాష్‌ క్యామ్ గురించి 5 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఈ డాష్‌ క్యామ్‌ లో మూడు కెమెరాలు ఉంటాయి. ఒకటి కార్ ముందు భాగాన్ని, మరొకటి వెనుక భాగాన్ని, ఇంకొకటి క్యాబిన్ లోపలి భాగాన్ని రికార్డ్ చేస్తాయి. సాధారణంగా చాలా డాష్‌ క్యామ్‌ లు కేవలం ముందు రోడ్డును మాత్రమే రికార్డ్ చేస్తాయి. కానీ, ఈ కొత్త మోడల్ పూర్తి కవరేజ్ అందిస్తుంది.

Advertisement

⦿ ముందు కెమెరా 2K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక, క్యాబిన్ కెమెరాలు 1K రిజల్యూషన్‌ లో పనిచేస్తాయి. ముందు కెమెరా హై రిజల్యూషన్‌ లో ఉండటం వల్ల నంబర్ ప్లేట్లు, రోడ్డు బోర్డులు లాంటి వివరాలు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైవే డ్రైవింగ్ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే, వీడియో క్వాలిటీ లైటింగ్,  కెమెరా సెన్సార్‌ పై  ఆధారపడి ఉంటుంది.

⦿ ఈ డాష్‌ క్యామ్ వైడ్ యాంగిల్ లెన్స్‌ తో వస్తుంది. ఇది 120 నుంచి 140 డిగ్రీల వరకు రోడ్డును కవర్ చేస్తుంది. దీంతో రోడ్డుపై ఎక్కువ భాగం వీడియోలో కనిపిస్తుంది. బ్లైండ్ స్పాట్స్ తగ్గుతాయి. సిటీ ట్రాఫిక్‌లో పక్కల నుంచి అకస్మాత్తుగా వచ్చే వాహనాలు, బైక్‌లను కూడా రికార్డ్ చేయగలదు.

Advertisement

⦿ యూనో మిండా ఈ డాష్‌ క్యామ్‌లో Wi-Fi, మొబైల్ యాప్ సపోర్ట్ కూడా ఇచ్చింది. దీని వల్ల ప్రతిసారీ మెమరీ కార్డ్ తీసి వీడియోలు చూడాల్సిన అవసరం ఉండదు. స్మార్ట్‌ ఫోన్‌ తో కనెక్ట్ చేసి యాప్ ద్వారా నేరుగా ఫుటేజ్ చూడొచ్చు. అవసరమైతే వీడియోలను వెంటనే సేవ్ చేయడం, షేర్ చేయడం కూడా సులభంగా చేయవచ్చు.

⦿ ఇందులో G-సెన్సార్ అనే ఫీచర్ ఉంది. కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ఏదైనా ఢీకొంటే, ఆ సమయంలో రికార్డ్ అయిన వీడియోను ఇది ఆటోమేటిక్‌ గా లాక్ చేస్తుంది. దీంతో ఆ ఫుటేజ్ డిలీట్ కాకుండా సురక్షితంగా ఉంటుంది. ప్రమాదాల సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ డాష్‌ క్యామ్ 256GB వరకు మైక్రో SD కార్డ్‌ కు సపోర్ట్ చేస్తుంది. చిన్న డిస్‌ ప్లే, కాంపాక్ట్ డిజైన్‌ తో రావడం వల్ల విండ్‌ షీల్డ్‌ పై ఎక్కువ స్థలం కూడా తీసుకోదు. పూర్తి రోడ్ కవరేజ్, మంచి వీడియో క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లతో యూనో మిండా కొత్త 3 ఛానల్ డాష్‌ క్యామ్ కార్ యూజర్లకు యూజ్ పుల్ ఆప్షన్ గా మారనుంది.

Read Also: కొత్త టాటా టియాగో ఈవీ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×