E-Paper
Advertisement

Lava Blaze Duo Discount: రూ.13299కే డుయల్ స్క్రీన్ ఫోన్.. లావా బ్లేజ్ డుయోపై బంపర్ డిస్కౌంట్

Lava Blaze Duo Discount: రూ.13299కే డుయల్ స్క్రీన్ ఫోన్.. లావా బ్లేజ్ డుయోపై బంపర్ డిస్కౌంట్
Advertisement

Lava Blaze Duo Discount| భారతదేశంలో కొత్త డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ఇండియాన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా సన్నాహాలు చేస్తోంది. తాజా రిపోర్ట్ ప్రకారం.. డబుల్ స్క్రీన్ గల లావా బ్లేజ్ డుయో 3 5G డిసెంబర్ 2025లో లాంచ్ కావచ్చు. అయితే ఈ లాంచ్ కంటే ముందు.. లావా బ్లేజ్ డుయో ప్రస్తుత మోడల్ ధరలను తగ్గించింది. లావా బ్లేజ్ డుయో 5G ఇప్పుడు ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో రెండు స్క్రీన్లను ఆఫర్ చేస్తుంది. యూనిక్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

ఒరిజినల్ లాంచ్ ధర

లాంచ్ సమయంలో లావా బ్లేజ్ డ్యూయో 5G రెండు వేరియంట్లలో వచ్చింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999. ఆర్క్టిక్ వైట్, సెలెస్టియల్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. ఈ ధరలు దాన్ని మిడ్-బడ్జెట్ కేటగిరీలో ఉంచాయి.

అమెజాన్‌లో తాజా డిస్కౌంట్ ఆఫర్ 

Advertisement

అమెజాన్‌లో సెలెస్టియల్ బ్లూ 8GB RAM వేరియంట్ తక్కువ ధరకు లభిస్తోంది. ఇప్పుడు ధర రూ.14,299 మాత్రమే. ఇది రూ.2,700 డైరెక్ట్ డిస్కౌంట్. కొన్ని బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ లో ఫైనల్ ధర రూ.13,299కి వస్తుంది. మొత్తం రూ.3,700 సేవింగ్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ ప్రస్తుతం అమెజాన్‌ లో మాత్రమే ఉంది.

డ్యుయల్ స్క్రీన్ డిజైన్ హైలైట్స్

లావా బ్లేజ్ డ్యూయో 5G డ్యూయల్ స్క్రీన్ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రధానంగా పెద్ద AMOLED డిస్‌ప్లే ఉంది. వెనుక వైపు చిన్న సెకండరీ AMOLED డిస్‌ప్లే ఉంది. మెయిన్ స్క్రీన్ 6.67 అంగుళాలు, ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్, కర్వ్‌డ్ ఎడ్జెస్. స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్. రియర్ స్క్రీన్ 1.58 అంగుళాలు, షార్ప్ పిక్సెల్ డెన్సిటీతో AMOLED. నోటిఫికేషన్లు, కాల్స్, అలర్ట్స్ సెకండరీ స్క్రీన్‌లో చూడవచ్చు.

పనితీరు, స్టోరేజ్ 

Advertisement

ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పవర్ ఎఫిషియెంట్ 6nm ఆర్కిటెక్చర్. రోజువారీ టాస్క్‌లు స్మూత్‌గా జరుగుతాయి. 8GB LPDDR5 RAM వరకు ఉంది. 128GB UFS 3.1 స్టోరేజ్. స్టోరేజ్ ఎక్స్‌పాన్షన్ సపోర్ట్ లేదు. ఆండ్రాయిడ్ 14తో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ హామీ ఇచ్చారు.

కెమెరా ఫీచర్లు

లావా బ్లేజ్ డుయో 5Gలో 64MP ప్రధాన రియర్ కెమెరా ఉంది. ఇందులో సోనీ సెన్సార్ ఉంది. 2MP డెప్త్ కెమెరా ఉంది. మంచి లైటింగ్‌లో క్లియర్ ఇమేజ్‌లు తీస్తుంది. సెల్ఫీలకు 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. బేసిక్ వీడియో కాలింగ్ అవసరాలకు సరిపోతుంది.

Also Read: వాట్సాప్‌ స్టేటస్‌, చానల్‌లో యాడ్స్ వస్తున్నాయా? తొలగించాలంటే ఇలా చేయండి

బ్యాటరీ, ఛార్జింగ్ 

ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. సాధారణ ఉపయోగంలో రోజంతా బ్యాటరీ నడుస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ USB టైప్-C ద్వారా సపోర్ట్ చేస్తుంది. బిజీ షెడ్యూల్‌లో త్వరగా ఛార్జ్ అవుతుంది.

కనెక్టివిటీ, సెక్యూరిటీ ఫీచర్లు 

డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్. 5G, 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.2 ఉన్నాయి. నావిగేషన్‌కు GPS. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. IP64 రేటింగ్‌తో దుమ్ము, నీరు నుంచి ప్రొటెక్షన్ ఉంది.

బెస్ట్ డీల్

లావా బ్లేజ్ డుయో 5G అరుదైన డ్యుయల్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ప్రస్తుత డిస్కౌంట్ దాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. తక్కువ ధరలో ఇన్నోవేషన్ కావాలనుకునేవారికి ఈ డీల్ బెస్ట్.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×