E-Paper
Advertisement

లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్లు.. రూ.8,999 ప్రారంభ ధరకే Lava Virat V1, V1 5G లాంచ్!

లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్లు.. రూ.8,999 ప్రారంభ ధరకే Lava Virat V1, V1 5G లాంచ్!
Advertisement

Lava Budget Phones: ప్రముఖ భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యంతో స్వదేశీ మార్కెట్లోకి Virat సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇందులో Lava Virat V1 5G, Lava Virat V1 మోడళ్లు ఉన్నాయి. విద్యార్థులు, బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు. ఈ ఫోన్లు జులై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, లావా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి.

Lava Virat V1 5G ప్రత్యేకతలు:

ఈ సిరీస్‌లో టాప్ మోడల్ అయిన V1 5Gలో 6.75 ఇంచీల HD+ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. యూనిసోక్ T8200 ప్రొసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉన్నాయి. రోజంతా ఇంటర్నెట్ వాడినా ఛార్జింగ్ తగ్గొద్దని 6000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

Advertisement

Also Read: SD కార్డ్, క్లౌడ్ పేమెంట్స్ అక్కర్లేదు.. ఈ 5 స్టెప్స్‌ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకోండి!

తక్కువకే Lava Virat V1 4G:

మరింత తక్కువ బడ్జెట్‌లో ఫోన్ కావాలనుకునే వారి కోసం Virat V1 లభిస్తుంది. దీనిలో 90Hz రీఫ్రెష్ రేట్‌ ఉన్న 6.75 ఇంచీల డిస్‌ప్లే, యూనిసోక్ SC9863A ప్రొసెసర్ అందించారు. ఇది 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్‌తో వస్తుంది. తేలికపాటి ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌తో పనిచేసే ఈ మోడల్ నిలగిరి బ్లూ, హిమాలయన్ సిల్వర్ రంగుల్లో దొరుకుతుంది.

క్లీన్ సాఫ్ట్‌వేర్, డోర్‌స్టెప్ సర్వీస్:

Advertisement

ఈ రెండు ఫోన్లలో అసలు యాడ్స్ కానీ, అనవసరమైన యాప్స్ (బ్లోట్‌వేర్) కానీ ఉండవు. రెండింటిలోనూ 13MP AI మెయిన్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాతో పాటు IP64 డస్ట్, స్ప్లాష్ నిరోధకత ఇచ్చారు. వీటితో పాటు ఇంటి వద్దకే వచ్చి ఫోన్ బాగుచేసే ఉచిత డోర్‌స్టెప్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను కూడా లావా అందిస్తోంది.

Also Read: ఫేస్‌బుక్‌లో పొరపాటున స్టోరీ పోస్ట్ చేశారా? ఇలా క్షణాల్లో డిలీట్ చేసేయండి!

Related News

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?

రూ.55 వేలలో అత్యుత్తమ టీవీలు.. ఫీచర్లు చూస్తే.. అంత పెట్టినా పర్లేదంటారు!

యాపిల్ లేటెస్ట్ ఫీచర్.. ఐఫోన్‌లో కొత్త Siri AI డిజైన్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

5000 నిట్స్ బ్రైట్‌నెస్, ఐదేళ్లు అప్‌డేట్స్.. శాంసంగ్ నుంచి కేక పుట్టించే స్మార్ట్‌వాచ్‌లు!

SD కార్డ్, క్లౌడ్ పేమెంట్స్ అక్కర్లేదు.. ఈ 5 స్టెప్స్‌ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకోండి!

రూ.15 వేలలోపు బెస్ట్ వాషింగ్ మెషీన్ కావాలా? మీ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్

Big Stories

Advertisement
×