Best EV Cars Under Rs. 15 Lakh: భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం, ఛార్జింగ్ సౌకర్యాలు విస్తరిస్తుండటంతో చాలా మంది ఇప్పుడు EVల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రూ.15 లక్షల లోపు బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, అంతకు మించి రేంజ్ తో పలు కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బడ్జెట్ లో కొనుగోలు చేసే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV. దీని ధర రూ.7.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. చిన్న సైజ్ కారణంగా సిటీలో ట్రాఫిక్ మధ్య ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. 17.3 kWh బ్యాటరీతో ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో సుమారు 180 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. రోజువారీ సిటీ ప్రయాణాలకు ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో లభించే టియాగో EV, ఐదు డోర్లతో వచ్చే పూర్తి స్థాయి హ్యాచ్ బ్యాక్. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ AC, రియర్ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి. 19.2 kWh, 24 kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. పెద్ద బ్యాటరీతో గరిష్టంగా 293 కి.మీ క్లెయిమ్డ్ రేంజ్ ఉండగా, సుమారు 230 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
రూ.9.99 లక్షల నుంచి లభించే టాటా పంచ్ EV ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ SUVల్లో ఒకటి. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 25 kWh, 35 kWh బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో కంపెనీ 421 కి.మీ రేంజ్ క్లెయిమ్ చేస్తుండగా, రియర్ వరల్డ్ లో సుమారు 350 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
సెడాన్ కారును కోరుకునేవారికి టాటా టిగోర్ EV మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 26 kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. సాధారణ వినియోగంలో సుమారు 250 కి.మీ వరకు రేంజ్ లభిస్తుంది. పెద్ద బూట్ స్పేస్ కూడా లభిస్తుంది.
భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ SUVల్లో నెక్సాన్ EV ఒకటి. ప్రారంభ ధర రూ.12.49 లక్షలు. 30 kWh, 45 kWh బ్యాటరీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో 489 కి.మీ వరకు క్లెయిమ్డ్ రేంజ్ ఉండగా, రియల్ వరల్డ్ లో 380 నుంచి 400 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. పనోరమిక్ సన్ రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి.
రూ.12.65 లక్షల ప్రారంభ ధరతో లభించే MG విండ్సర్ EV మంచి క్యాబిన్, ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. 38 kWh, 52.9 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో 449 కి.మీ వరకు క్లెయిమ్డ్ రేంజ్ ఉండగా, సాధారణ వినియోగంలో సుమారు 380 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
Read Also: 2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?