Lenovo AI Glasses Teleprompter, Real Time Translation | 2026లో లెనోవో CES అనేక ప్రొడక్ట్స్ షోకేస్ చేయాలని ప్లాన్ చేస్తోంది. వీటన్నింటిలో అతిపెద్ద హైలైట్ లెనోవో AI గ్లాసెస్ కాన్సెప్ట్. కొన్ని లెనోవో ప్రొడక్ట్స్ కాన్సెప్ట్స్ మాత్రమే. మరికొన్ని ఈ ఏడాది చివర్లో లాంచ్ అవవచ్చు. విండోస్ లేటెస్ట్ ఈ గ్లాసెస్ ఇమేజెస్ మరియు కీ డీటెయిల్స్ రివీల్ చేసింది. లెనోవో ఇవి పర్సనల్ AI హెడ్‌సెట్‌గా డిజైన్ చేసింది. సాధారణ వేరబుల్ డివైస్ లాగా కనిపిస్తాయి. అయితే అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇస్తాయి.
లెనోవో స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగించే తీరునే మార్చాలనుకుంటోంది. రోజువారీ వినియోగం కోసమే కంపెనీ ఈ గ్లాసెస్ బిల్డ్ చేసింది. ప్రొడక్టివిటీ, కమ్యూనికేషన్, స్మార్ట్ అసిస్టెన్స్‌పై ఫోకస్ ఉంది. ఈ కాన్సెప్ట్ ఆపిల్, మెటా వంటి పోటీదారులను టార్గెట్ చేస్తుంది. లెనోవో లైట్‌వెయిట్ డిజైన్‌లో బలమైన AI ఫీచర్లు ఇవ్వాలనుకుంటోంది.
ఈ గ్లాసెస్‌లో అత్యుత్తమ ఫీచర్.. ఇందులోని బిల్ట్-ఇన్ టెలిప్రాంప్టర్ మోడ్. ఇది ప్రెజెంటేషన్స్ లేదా పబ్లిక్ స్పీకింగ్ సమయంలో సహాయపడుతుంది. ప్రెజెంటర్లు, స్ట్రీమర్లు, వీడియో క్రియేటర్లకు ఉపయోగకరం. యూజర్లు స్క్రిప్ట్స్‌ను గ్లాసెస్ నుంచి నేరుగా రీడ్ చేయవచ్చు. ఎక్స్‌ట్రా స్క్రీన్స్ అవసరం తగ్గుతుంది. ఆడియన్స్‌తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.
లెనోవో కొత్తగా ఈ ఏఐ గ్లాసెస్‌లో టచ్, వాయిస్ కంట్రోల్స్ జోడించింది. ఎక్స్‌టర్నల్ డివైస్‌లు లేకుండా ఇంటరాక్ట్ చేయవచ్చు. గ్లాసెస్ స్టాండ్‌అలోన్ కమ్యూనికేషన్ టూల్‌గా పనిచేస్తాయి. కాల్స్ నేరుగా హ్యాండిల్ చేయవచ్చు. మ్యూజిక్ ప్లేబ్యాక్ సులభంగా కంట్రోల్ చేయవచ్చు. ఇన్ఫర్మేషన్ వెంటనే యాక్సెస్ చేయవచ్చు.
లెనోవో తన AI అసిస్టెంట్ లెనోవో కిరాను ఈ గ్లాసెస్‌లో ఇంక్లూడ్ చేసింది. గ్లాసెస్‌లో కిరా ఏఐ నేరుగా రన్ కాదు. కనెక్టెడ్ ఫోన్ లేదా కంప్యూటర్ ఆధారంగా నడుస్తుంది. ఈ మెథడ్ హెవీ ప్రాసెసింగ్ టాస్క్స్ ఆఫ్‌లోడ్ చేస్తుంది. గ్లాసెస్ లైట్‌వెయిట్, ఎఫిషియెంట్‌గా ఉంటాయి. అయితే పెయిర్డ్ డివైస్ సమీపంలో ఉంచాలి.
గ్లాసెస్, డివైజ్ కనెక్ట్ అయినప్పుడు కిరా ఏఐ రియల్-టైమ్ లైవ్ ట్రాన్స్‌లేషన్ ఇస్తుంది. ట్రాన్స్‌లేషన్ సబ్-మిల్లీసెకండ్ రెస్పాన్స్ టైమ్స్‌లో పనిచేస్తుంది. భాషల మధ్య త్వరగా చర్చలను సపోర్ట్ చేస్తుంది. ఇమేజ్ రికగ్నిషన్‌ని కూడా కిరా ఏఐ ఎనేబుల్ చేస్తుంది. ఫ్రంట్ మౌంటెడ్ కెమెరా ఈ ఫీచర్లు పవర్ చేస్తుంది. ఆబ్జెక్ట్స్ లేదా సీన్స్ వెంటనే ఐడెంటిఫై చేయవచ్చు.
ఈ గ్లాసెస్‌లో లెనోవో “క్యాచ్ మీ అప్” అనే ఫీచర్ జోడించింది. ఇది మల్టిపుల్ డివైస్‌ల నుంచి నోటిఫికేషన్స్ సమ్మరైజ్ చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే యాక్టివ్ గా ప్రారంభమైపోతుంది. ముఖ్యమైన అప్‌డేట్స్ క్విక్ ఓవర్‌వ్యూ ఇస్తుంది. టైమ్ సేవ్ చేసి స్క్రీన్ డిపెండెన్స్ తగ్గిస్తుంది.
Also Read: యూట్యూబ్ ఛానెల్‌తో ఈజీగా కోట్ల ఆదాయం.. ఏఐ వీడియోలతో రూ.38 కోట్లు సంపాదన
లెనోవో AI గ్లాసెస్ 8 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. రోజువారీ ప్రొఫెషనల్ వినియోగానికి ఈ బ్యాటరీ లైఫ్ సరిపోతుంది. గ్లాసెస్ బరువు సుమారు 45 గ్రాములు. లైట్‌వెయిట్ బిల్డ్ కంఫర్ట్ పెంచుతుంది. ఎక్కువ సేపు ధరించడానికి అనుకూలంగా ఉంటాయి.
లెనోవో ఈ కాన్సెప్ట్ గ్లాసెస్‌ను ఆపిల్, మెటాకు పోటీగా పొజిషన్ చేస్తోంది. కంపెనీ ప్రాక్టికల్ AI అప్లికేషన్స్‌పై ఫోకస్ చేస్తోంది. ప్రొడక్టివిటీని వేరబుల్ కంఫర్ట్‌తో బ్లెండ్ చేస్తోంది. ప్రస్తుతానికి కాన్సెప్ట్ దశలో ఉన్నప్పటికీ దీని ఫీచర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. లాంచ్ ముందు లెనోవో ఫీచర్లు రిఫైన్ చేయవచ్చు. ఈ గ్లాసెస్ లెనోవో సీరియస్ AI యాంబిషన్స్‌ను సూచిస్తున్నాయి.