E-Paper
Advertisement

YCP Leaders: వైసీపీ నుంచి నలుగురు సస్పెండ్.. కారణం ఇదే..!

YCP Leaders: వైసీపీ నుంచి నలుగురు సస్పెండ్.. కారణం ఇదే..!
Advertisement

YCP Leaders: వైసీపీ అధిష్టానం క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు మరోసారి రుజువు చేసింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన నలుగురు కీలక నేతలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ, క్షమశిక్షణారాహిత్యంగా వ్యవహరించారనే కారణంతో.. ఈ చర్యలు తీసుకున్నట్లు పార్టీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

సస్పెండ్ అయిన వారిలో వడమలపేట ఎంపీపీ విజయలక్ష్మి, అత్తూరు ఎంపీటీసీ దుర్గాదేవి, ఆరూరు ఎంపీటీసీ ఎం. రమ్య, బూచివనత్తం ఎంపీటీసీ డి. రాజ్‌గోపాల్ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు, పార్టీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించారని అధిష్టానం నిర్ధారించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో వీరి ప్రవర్తనపై పార్టీకి అనేక ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ విభాగం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. సంఘటనల వివరాలు, స్థానిక నేతల అభిప్రాయాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని.. అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని పలువురు చెబుతున్నారు.

ఈ సస్పెన్షన్ నిర్ణయం వైసీపీలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోమన్న సందేశాన్ని జగన్ మరోసారి బలంగా పంపారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read: శ్రీకాకుళం వాసులకు గుడ్ న్యూస్.. కీలక హాల్ట్ లకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

పార్టీ క్రమశిక్షణను నిలబెట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో అసంతృప్తి కలిగిన నేతల చలనం పెరగడంతో, పార్టీ ఉన్నతస్థాయి నిర్ణయం తీసుకుని ఇలా కఠిన చర్యలు చేపట్టింది. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించేవారిపై సహనం ఉండదన్న సాంకేతాన్ని వైసీపీ స్పష్టంగా పంపుతోంది.

Related News

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్తై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Big Stories

Advertisement
×