E-Paper
Advertisement

గేమర్స్ బీ రెడీ.. రూ.11 వేలకే 280Hz రిఫ్రెష్ రేట్.. లెనోవో కొత్త గేమింగ్ మానిటర్ చూశారా?

గేమర్స్ బీ రెడీ.. రూ.11 వేలకే 280Hz రిఫ్రెష్ రేట్.. లెనోవో కొత్త గేమింగ్ మానిటర్ చూశారా?
Advertisement

Lenovo Legion 27 1R: బడ్జెట్ ధరలో అద్భుతమైన డిస్‌ప్లే, మెరుపు వేగంతో పనిచేసే రిఫ్రెష్ రేట్ ఉన్న మానిటర్ కావాలనుకుంటున్న వారి కోసం లేటెస్ట్ గేమింగ్ మానిటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది ప్రముఖ దిగ్గజ సంస్థ లెనోవో. Legion 27 1R పేరిట విడుదల చేసిన ఈ మానిటర్.. గేమర్లకు సరికొత్త అనుభూతిని అందించనుంది. పైగా సామాన్యులు సైతం కొనగలిగేలా రీజనబుల్ ధరకే లభిస్తుండటం మరో విశేషం.

కళ్లు చెదిరే డిస్‌ప్లే.. స్మూత్ గేమింగ్:

ఈ కొత్త Lenovo Legion 27 1R అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 280Hz రిఫ్రెష్ రేట్ గురించి. దీంతో గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ చాలా స్మూత్‌గా, ఎలాంటి ఆటంకం లేకుండా కనిపిస్తాయి. దీని 0.5ms రెస్పాన్స్ టైమ్ వల్ల ఫాస్ట్ యాక్షన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు సీన్స్ చాలా షార్ప్‌గా, స్పష్టంగా కనిపిస్తాయి.

Advertisement

Also Read: Redmi 17 4G లీక్స్.. 7500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో త్వరలోనే మార్కెట్లోకి!

రియలిస్టిక్ కలర్స్.. గ్రాఫిక్స్ అదిరిపోతాయి:

గేమ్‌లో ప్రతి ఒక్క విజువల్ ఎంతో నాచురల్‌గా కనిపించేలా ఈ ఐపీఎస్ ప్యానెల్‌ను రూపొందించారు. ఇది 99 శాతం sRGB కలర్ గ్యామట్‌కు సపోర్ట్ చేస్తుంది. దాదాపు 16.7 మిలియన్ రంగులను ఎంతో సహజంగా చూపిస్తుంది. పైగా 400 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల, ఎలాంటి వెలుతురు ఉన్నా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ టైరింగ్ తగ్గేందుకు అనువుగా అడాప్టివ్ సింక్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

కళ్లకు రక్షణ.. కనెక్టివిటీ ఆప్షన్స్:

Advertisement

గంటల తరబడి గేమ్స్ ఆడినా కళ్లు అలసిపోకుండా ఉండేందుకు ఐసేఫ్ 2.0 టెక్నాలజీని ఉపయోగించారు. ఇది రంగుల క్వాలిటీ తగ్గకుండానే హానికరమైన బ్లూ లైట్‌ను తగ్గిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో డిస్‌ప్లే పోర్ట్ 1.4 తో పాటు రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉన్నాయి. కాకపోతే పూర్తి స్థాయిలో 280Hz రిఫ్రెష్ రేట్ పొందాలంటే డిస్‌ప్లే పోర్ట్ ద్వారానే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ధర ఎంతంటే?

ఈ అద్భుతమైన మానిటర్ ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. అక్కడ దీని ధర రూ.11,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం లెనోవో అధికారిక వెబ్‌సైట్, జేడీ కామ్‌లలో ఇది సేల్‌కు అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే గేమర్లకు ఇది ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: ఇది కదా టెక్నాలజీ అంటే.. స్మార్ట్ గ్లాసెస్ కోసం గోరంత కూలింగ్ ఫ్యాన్!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×