Malavika mohanan: ప్రముఖ మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika mohanan) తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ చేసిన చిత్రం ‘ది రాజాసాబ్’.. మారుతి(Maruthi ) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas ) హీరోగా తన కెరీర్ లో తొలిసారి హారర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమా. అయితే ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. కానీ మాళవిక మాత్రం తన నటనతో మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం పలు భాషా చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె.. తాజాగా సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలలో మహిళలకు లభిస్తున్న పాత్రలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది . హీరోయిన్స్ కి తమ డ్రీమ్ రోల్ పడాలంటే కచ్చితంగా అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాల్సిందే అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది.
ఈ మేరకు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కమర్షియల్ సినిమాలలో హీరోయిన్లకు మూస పద్ధతులకు భిన్నమైన పాత్రలు లభించకపోవడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది. “మన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం లేడీ రైటర్స్, లేడీ డైరెక్టర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే చలనచిత్ర నిర్మాణ రంగంలో ఎక్కువమంది ఫిమేల్ మేకర్స్, ఫిమేల్ రైటర్స్ ముందుకు వస్తారో.. అప్పుడే నటీమణులకు కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా యాక్షన్ ఆధారిత వైవిధ్యమైన పాత్రలలో నటించే అవకాశాలు లభిస్తాయి. అప్పుడే హీరోయిన్స్ కూడా తాము అనుకున్న డ్రీమ్ రోల్ చేయడానికి వీలుంటుంది. మీనాకు కూడా గ్లామర్ ఇమేజ్ దాటి హాలీవుడ్ సంచలనం ‘కిల్ బిల్ ‘ తరహా పూర్తిస్థాయి యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాను” అంటూ తన కోరికను బయటపెట్టింది.
మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి సరైన పాత్ర పడాలి అంటే మహిళా మేకర్స్ , మహిళా రైటర్స్ సంఖ్య పెరిగితే ఆటోమేటిక్గా మహిళలకి ప్రాధాన్యత పెరుగుతుంది అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. మాళవిక విషయానికి వస్తే.. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె ఎవరో కాదు మలయాళ సినిమాటోగ్రాఫర్ కే. యూ.మోహనన్ కుమార్తె. 2013 లో వచ్చిన ‘పట్టంపోల్’ అనే మలయాళ చిత్రం ద్వారా దుల్కర్ సల్మాన్ సరసన నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అలాగే ప్రముఖ దర్శకుడు మజిద్ మజిదీ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘బియాండ్ ది క్లౌడ్స్’ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
also read:రామాయణ కోసం సాయి పల్లవి రెమ్యూనరేషన్?
తమిళంలో రజినీకాంత్(Rajinikanth ) హీరోగా నటించిన ‘పేట’ చిత్రంతో కోలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. మాస్టర్ ,తంగలాన్ వంటి చిత్రాలలో కూడా నటించింది. ప్రస్తుతం కోలీవుడ్లో కార్తీ సరసన ‘సర్దార్ 2 ‘ తో పాటు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ‘పాకెట్ నావెల్’ చిత్రాలలో కూడా కీలకపాత్రలు పోషిస్తుంది. ఇక తెలుగు విషయానికి వస్తే రవితేజ , శ్రీ విష్ణు కాంబినేషన్లో రాబోతున్న మల్టీ స్టారర్ మూవీలో కూడా ఈమెను హీరోయిన్గా తీసుకోవడానికి మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.