Lenovo Yoga Tab Gen 2: టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ప్రముఖ బ్రాండ్ లెనోవో, మరో అద్భుతమైన గాడ్జెట్‌తో టెక్ లవర్స్‌ను ఫిదా చేయడానికి వచ్చేసింది. అదే సరికొత్త ‘లెనోవో యోగా ట్యాబ్ జెన్ 2’. ఇది అల్ట్రా-క్లియర్ 4కే డిస్‌ప్లే, సూపర్‌ఫాస్ట్ 144Hz రిఫ్రెష్ రేట్, బ్లజింగ్ ఫాస్ట్ 68W ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. అసలు ఈ ట్యాబ్ ప్రత్యేకతలు ఏంటి? దీని ధర ఎంత? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!
ఐ-క్యాచింగ్ విజువల్స్:
ఈ ట్యాబ్ మెయిన్ హైలైట్ దీని.. స్క్రీన్ అనే చెప్పాలి. క్రిస్టల్ క్లియర్ విజువల్స్ ఇచ్చే.. 4K డిస్‌ప్లేతో.. పాటు ఏకంగా 144Hz.. రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇచ్చారు. అంటే .. మీరు సినిమాలు చూస్తున్నా, హై-ఎండ్ గేమ్‌లు ఆడుతున్నా.. స్క్రీన్.. ఎలాంటి లాగ్స్ లేకుండా ఉంటుంది. గ్రాఫిక్స్ లవర్స్‌కు ఇది నూటికి నూరుపాట్లు సరి పోతుంది.
నాన్-స్టాప్ పెర్ఫార్మెన్స్ :
పెద్ద పెద్ద యాప్స్, హెవీ సాఫ్ట్‌వేర్ రన్ చేసినా.. ఈ ట్యాబ్ చిటికెలో పని చేస్తుంది. దీనిలోని.. లేటెస్ట్ ప్రాసెసర్ మల్టీటాస్కింగ్‌ను చాలా ఈజీ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. రోజంతా నాన్-స్టాప్ ట్యాబ్ వాడినా టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే.. ఇందులో ఇచ్చిన 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కేవలం తక్కువ సమయంలోనే.. బ్యాటరీని ఫుల్ చేసేస్తుంది.
సిగ్నేచర్ డిజైన్ & థియేటర్ లెవెల్ సౌండ్:
లెనోవో యోగా సిరీస్ అనగానే ఆ స్టైలిష్ కిక్‌స్టాండ్ డిజైన్ గుర్తుకొస్తుంది. ఎలాంటి.. ఎక్స్‌ట్రా సపోర్ట్ లేకుండా.. ట్యాబ్‌ను టేబుల్ మీద ఎక్కడైనా కంఫర్టబుల్‌గా సెట్ చేసుకోవచ్చు. దీనికి తోడు బిల్ట్-ఇన్ హై-క్వాలిటీ స్పీకర్లు ఇస్తున్న.. సౌండ్ ఎక్స్‌పీరియన్స్ మిమ్మల్ని నేరుగా థియేటర్ ఫీలింగ్‌లోకి తీసుకెళ్తుంది.
Also Read: రూ.28వేలకే.. 55 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ అంటే ఇలా ఉండాలి
ధర :
ఈ ప్రీమియం గాడ్జెట్ ధర విషయానికి వస్తే.. దీని వేరియంట్లు , స్టోరేజ్ కెపాసిటీని.. బట్టి మారుతుంది. మార్కెట్ అంచనాల ప్రకారం దీని ప్రారంభ ధర సుమారు రూ. 45,000 నుంచి రూ. 55,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్‌లో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అంటే ఖచ్చితంగా వర్త్ అనే చెప్పాలి.
మీరు ఒక పర్ఫెక్ట్, ఆల్-ఇన్-వన్ ప్రీమియం టాబ్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. లెనోవో యోగా ట్యాబ్ జెన్ 2 మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. 4కే విజువల్స్, రాకెట్ లాంటి ఛార్జింగ్ స్పీడ్ కోరుకునే.. వారు ఈ ట్యాబ్‌ను మీ విష్ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. త్వరలోనే ఇది అధికారికంగా మార్కెట్లో అందుబాటులోకి రానుంది!