LPG Saving Kitchen Tips: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మన దగ్గర ఉన్న గ్యాస్‌ను జాగ్రత్తగా వాడుకోవడం చాలా ముఖ్యం . కానీ మనకు తెలియకుండానే రోజూ వంట చేస్తూ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. అవే గ్యాస్‌ను అవసరానికి మించి ఖర్చు అయ్యేలా చేస్తాయి.
ఉదాహరణకు.. మూత పెట్టకుండా వంట చేయడం, సరైన బర్నర్ ఉపయోగించకపోవడం, పప్పు ధాన్యాలు ముందుగా నానబెట్టకుండా నేరుగా వండటం వంటి చిన్న విషయాలు కూడా గ్యాస్ తొందరగా అయిపోయేలా చేస్తాయి. ఈ అలవాట్లను కాస్త మార్చుకుంటే గ్యాస్ చాలా వరకు ఆదా చేయవచ్చు. అందుకే చాలా మంది ఇళ్లలో సాధారణంగా జరుగుతున్న గ్యాస్ వాడకంలో జరిగే తప్పులు ఏంటి? వాటిని ఎలా సరి చేసుకోవాలి? గ్యాస్‌ను ఎలా సేవ్ చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. పప్పు ధాన్యాలు:
రాజ్మా, శనగలు, పప్పులు, బియ్యం వంటి వాటిని ముందుగా నానబెట్టకపోతే అవి ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో గ్యాస్ కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. కానీ ముందుగానే నానబెడితే గింజలు మెత్తబడతాయి. అంతే కాకుండా వంట త్వరగా పూర్తవుతుంది.
ఎంతసేపు నానబెట్టాలి?
రాజ్మా, శనగలు – 8 నుంచి 10 గంటలు
పప్పులు – 30 నుంచి 60 నిమిషాలు
బియ్యం – 20 నుంచి 30 నిమిషాలు
2. సరైన బర్నర్ ఉపయోగించకపోవడం:
స్టౌవ్‌పై ఉన్న బర్నర్లు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. వాటిని సరైన విధంగా ఉపయోగించాలి.
చిన్న బర్నర్ ఉపయోగించాల్సినవి:
టీ లేదా కాఫీ
తాలింపు
మళ్లీ వేడి చేయడం
పెద్ద బర్నర్ ఉపయోగించాల్సినవి:
ప్రెషర్ కుకింగ్
నీరు మరిగించడం
పెద్ద వంటలు
చిన్న పాత్రను పెద్ద బర్నర్‌పై పెడితే.. గ్యాస్ వృథా అవుతుంది.
3. మూత లేకుండా వంట చేయడం:
మూత లేకుండా వంట చేస్తే.. వేడి బయటకు పోతుంది. దీంతో వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.
లాభాలు:
ఎల్పీజీ వాడకం 20–25% వరకు తగ్గుతుంది.
ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది.
వంట త్వరగా అవుతుంది.
అయితే తరచుగా.. మూత తీసి చూడకండి. ప్రతి సారి తీస్తే వేడి బయటకు పోతుంది.
4. కూరగాయలను పెద్ద ముక్కలుగా కోయడం:
పెద్ద ముక్కలుగా కోసిన కూరగాయలు ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. చిన్న ముక్కలుగా కోస్తే.. వేడి త్వరగా లోపలికి చేరుతుంది.
లాభాలు:
వంట సమయం తగ్గుతుంది.
గ్యాస్ ఆదా అవుతుంది.
6. బర్నర్ శుభ్రం చేయకపోవడం:
బర్నర్‌లోని రంధ్రాలు మూసుకుపోతే గ్యాస్ సరిగ్గా మండదు. అందుకే వీటిని ముందుగానే గుర్తించాలి.
ఎలా గుర్తించాలి ?
నీలి మంట – సరిగ్గా మండుతోందని అర్థం.
పసుపు మంట – గ్యాస్ వృథా అవుతోంది.
అందుకే.. బర్నర్‌ను తరచుగా శుభ్రం చేయాలి.
7. సరైన పాత్రలు ఉపయోగించకపోవడం:
పాత్రలు కూడా గ్యాస్ ఖర్చుపై ప్రభావం చూపుతాయి. ఫ్లాట్ బేస్ ఉన్న పాత్రలు వేడిని సమానంగా పంచి త్వరగా వంట అయ్యేలా చేస్తాయి.
బెస్ట్ పాత్రలు:
ట్రిపుల్ స్టీల్
కాస్ట్ ఐరన్
8. స్మార్ట్‌గా వంట చేయడం:
వంట చేసేటప్పుడు చేసే చిన్న మార్పులు ఎల్పీజీ వాడకాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
ఉదాహరణలు:
నీరు మరిగించడానికి ఎలక్ట్రిక్ కెట్టిల్ ఉపయోగించండి
ఒకేసారి ఎక్కువగా వండండి.
బియ్యం, పప్పు, కూరలు ఒకేసారి వండి రెండు మూడు భోజనాలకు ఉపయోగించండి.
ఇలా చేస్తే ఒకే గ్యాస్ తో ఎక్కువ వంటలు చేయవచ్చు.
Also Read: రూ.2000 లోపు బెస్ట్ ఇండక్షన్లు (2026) – టాప్ 5 మోడల్స్, ఫీచర్లు & ధర
వంటగదిలో ఎల్పీజీ ఆదా చేయడం చాలా కష్టం కాదు. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే గ్యాస్ వాడాకాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పప్పు ధాన్యాలను ముందుగా.. నానబెట్టడం, సరైన బర్నర్ ఉపయోగించడం, మూతతో వంట చేయడం వంటి మార్పులు మీ గ్యాస్ సిలిండర్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించుకునేలా చేస్తాయి. ఈ చిట్కాలను పాటిస్తే మీ గ్యాస్ ఖర్చు మాత్రమే కాదు, సమయం కూడా ఆదా అవుతుంది.