E-Paper
Advertisement

CM Chandrababu Naidu: ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు.. ఏపీ ఇక ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్.. సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు.. ఏపీ ఇక ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్.. సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ను ఈస్ట్ – వెస్ట్ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు.. ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మూలపేట.. మచిలీపట్నం.. రామాయపట్నం పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఓడరేవుల ద్వారా ఒడిశా.. చత్తీస్‌గఢ్.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర.. తెలంగాణ.. కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సరకు రవాణా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

మచిలీపట్నం.. రామాయపట్నం పోర్టుల నిర్మాణ పనులు 2026 డిసెంబరు నాటికి పూర్తి అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రామాయపట్నం పోర్టులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటైన తర్వాత అది కంటైనర్.. బల్క్ కార్గో హబ్‌గా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిందని వెల్లడించారు. మూడు పోర్టుల సమీపంలో పోర్టు టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్య లావాదేవీలను పెంచవచ్చని దిశానిర్దేశం చేశారు. పోర్టుల అనుసంధానంతో పారిశ్రామిక కారిడార్లు వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

Advertisement

ఫిషింగ్ హార్బర్ల విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రెండో దశలో భాగంగా బుడిగట్లపాలెం.. పూడిమడక.. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీప భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రానుందని దీనివల్ల ఏపీ ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ఓడరేవులు కార్గో హ్యాండ్లింగ్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలవాలని ఆకాంక్షించారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల దుబాయ్.. గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చంద్రబాబు విశ్లేషించారు. ఈ తరుణంలో భారత్‌లోని తూర్పు తీర ప్రాంత పోర్టులే సురక్షితమనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోందని చెప్పారు. ఈ అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. సముద్ర తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Advertisement

Read Also:  బ్లాక్ మార్కెట్‌కు వెళ్తే కఠిన చర్యలు.. గ్యాస్ సరఫరాపై అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×