E-Paper
Advertisement

MacBook Air Price drop: యాపిల్ లవర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌పై బంపర్ ఆఫర్!

MacBook Air Price drop: యాపిల్ లవర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌పై బంపర్ ఆఫర్!
Advertisement

MacBook Air Price drop: ఈ ఏడాది మార్చిలో టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్‌లోకి మ్యాక్‌బుక్ ఎయిర్-2025 ను విడుదల చేసిన విషయం తెలిసిందే. శక్తివంతమైన M4 చిప్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ ప్రీమియం పనితీరును అందిస్తుంది. M5 ప్రాసెసర్ వచ్చే వరకు.. ఇది యాపిల్ ల్యాప్‌టాప్ లైనప్‌లో కీలక మోడల్‌గా ఉండనుంది. లాంచ్ అయిన కొద్ది నెలలకే ఈ న్యూ మ్యాక్‌బుక్ ఎయిర్‌పై భారీగా ధర తగ్గించింది సంస్థ. సాధారణంగా యాపిల్ ఉత్పత్తులపై ఇలాంటి ఆఫర్లు అరుదుగా కనిపిస్తాయి. కాబట్టి ఈ మ్యాక్‌బుక్ కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

ఊహించని డిస్కౌంట్:

ఇటీవల అమెజాన్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ (2025) 13-అంగుళాల బేస్ వేరియంట్‌ను కేవలం రూ.90,900 ప్రారంభ ధరకే విక్రయిస్తున్నారు. లాంచ్ సమయంలో రూ. 99,900గా ఉన్న ధరతో పోలిస్తే, ఇది నేరుగా రూ.10,000 తగ్గింపు అన్నమాట. గత కొన్ని వారాల ధరల్ని పరిశీలిస్తే.. ఇదే ఇప్పటివరకు కనిపించిన అతి తక్కువ ధర. అందుకే, కొత్త మ్యాక్‌బుక్ కొనాలనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. వివో V50e 5G ఫోన్ అద్భుతమైన ధరలో, అస్సలు మిస్ అవ్వకండి!

రంగును బట్టి ధరలు:

ఈ ప్రత్యేక ధర స్టార్‌లైట్ కలర్ వేరియంట్‌కు మాత్రమే పరిమితం. స్కై బ్లూ, సిల్వర్, మిడ్‌నైట్ వంటి ఇతర రంగుల మోడల్స్ మాత్రం కొంచెం ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. వాటి ధరలు సుమారుగా రూ.92,900 నుంచి రూ.94,990 వరకు ఉన్నాయి. ఇక ఎక్కువ స్టోరేజ్ అవసరమయ్యే వినియోగదారుల కోసం, 16GB RAM + 512GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ఇప్పుడు రూ.1,11,900కు అందుబాటులో ఉంది. ఇది కూడా దాని అసలు ధరతో పోలిస్తే మంచి తగ్గింపే.

బ్యాంకు ఆఫర్లు ఇలా..

Advertisement

ధర తగ్గింపుతో పాటు, అమెజాన్ అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ICICI, SBI క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసే వారికి రూ. 5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో మొత్తం ఖర్చు మరింత తగ్గి, మ్యాక్‌బుక్ ఎయిర్ (2025) మరింత సరసమైన ఎంపికగా మారుతోంది.

స్పెసిఫికేషన్లు విషయానికొస్తే:

ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ మ్యాక్‌బుక్ ఎయిర్‌లో యాపిల్ యొక్క లేటెస్ట్ M4 ప్రాసెసర్ ఉంది. ఇందులో 10-కోర్ CPU, 8-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనుల కోసం ఈ చిప్ ఎంతో సమర్థంగా పనిచేస్తుంది. అలాగే 2,560×1,664 పిక్సెల్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్తో 13-అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లే ఇచ్చారు. మరో ముఖ్యమైన ఫీచర్‌గా, ఒకేసారి రెండు 6K డిస్‌ప్లేలను కనెక్ట్ చేసే సపోర్ట్ కూడా ఉంది.

53.8Wh బ్యాటరీ సామర్థ్యం:

ఆడియో, కనెక్టివిటీ పరంగా కూడా ఈ ల్యాప్‌టాప్ మెరుగైనదనే చెప్పాలి. ఇందులో క్వాడ్ స్పీకర్ సిస్టమ్, స్పేషియల్ ఆడియో సపోర్ట్, మూడు మైక్రోఫోన్లు ఉన్నాయి. కనెక్టివిటీకి Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, USB 4 పోర్ట్‌లు, మాగ్‌సేఫ్ 3 ఛార్జింగ్, అలాగే టచ్ ID భద్రతా ఫీచర్ ఇచ్చారు. ఇక బ్యాటరీ పరంగా చూస్తే.. 53.8Wh బ్యాటరీతో పాటు 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది దీర్ఘకాలం ఎలాంటి ఆటంకం లేకుండా ఉపయోగించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.

Also Read: షాకిచ్చిన మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ప్రైస్ డ్రాప్‌.. ఇప్పుడు కొనకపోతే తర్వాత మీరే ఫీలవుతారు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×