E-Paper
Advertisement

Dhurandhar Collections : దురంధర్ బాక్సాఫీస్ దూకుడు.. అవతార్ వచ్చిన అస్సలు తగ్గట్లేదుగా..

Dhurandhar Collections : దురంధర్ బాక్సాఫీస్  దూకుడు.. అవతార్ వచ్చిన అస్సలు తగ్గట్లేదుగా..

Dhurandhar Collections : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన తాజా చిత్రం దురంధర్.. ఆదిత్య ధార్ దర్శకత్వంలో స్పై, యాక్షన్ మూవీగా తెరకెక్కింది. దురంధర్ చిత్రాన్ని జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు కలిసి నిర్మించారు. ఈ మూవీలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్ వంటి నటీనటులు కీలక పాత్రలో నటించారు. విడుదలైన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి షో కి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 16 రోజులు అవుతున్న ఈ మూవీ కలెక్షన్స్ జోరు తగ్గట్లేదు.. దాదాపుగా 800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.. ఒకవైపు థియేటర్లలోకి అవతార్ మూవీ వచ్చినా కూడా ఈ మూవీ కలెక్షన్స్ తగ్గట్లేదు. మరి ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..

అవతార్ వచ్చిన దురంధర్ స్పీడు తగ్గలేదు..

ప్రపంచ వ్యాప్తంగా జనాలను ఆకట్టుకున్న హాలీవుడ్ మూవీ అవతార్.. ఇప్పటికే వచ్చిన రెండు పార్ట్ లు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించింది.. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ గా అవతార్ 3 ప్రేక్షకులు ముందుకు వచ్చింది.. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను అందుకుందని తెలుస్తుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ వచ్చిన తర్వాత దురంధర్ స్పీడ్ తగ్గుతుందేమోనని ట్రేడ్ వర్గాలు అనుమానించాయి. కానీ ఆ సూచనలు లేవు. దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఈసారి పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేదని రివ్యూలు చూస్తే అర్థమవుతుంది.. ఈ వీకెండ్ వరకు బాగానే ఉన్నా తర్వాత నెమ్మదించడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లకు అర్థమైపోయింది.. దురంధర్ సినిమా షోలు పెరుగుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం బాలీవుడ్ జనాలు రణవీర్ సింగ్ మూవీకి నిరాజనం పలుకుతున్నారు..

Also Read : 7/G బృందావన కాలనీ సీక్వెల్ అప్డేట్.. రిలీజ్ డేట్ చెప్పేసిన సుమన్ శెట్టి..

దురంధర్ 16 రోజుల కలెక్షన్స్.. 

ఈ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. సినిమా నుంచి బయటకు వచ్చిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. విడుదల అయిన తర్వాత కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చెయ్యాలి.. కానీ ఇప్పుడు డబల్ వసూళ్లను రాబట్టింది.. ప్రస్తుతం 1000 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు పరుగులు పెడుతుంది. ఈ వీకెండ్ లోపలే రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.. ఇదే జోరులో ఈ నెల కొనసాగితే మాత్రం మూవీ 2000 కోట్లు రాబట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా రణవీర్ సింగ్ సినిమాకు ఎన్ని కోట్ల వసూలు రావడం ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి…

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×