E-Paper
Advertisement

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?
Advertisement

Meta StoryKit: సాధారణంగా పిల్లల్ని పడుకోబెట్టాలంటే తల్లిదండ్రులు ఏదో ఒక కథ చెప్పాల్సిందే. అయితే ప్రతిసారీ ఇలా చేయాలంటే.. వాళ్లకి కాస్త కష్టమైన పనే. రోజూ కొత్త కథ ఎక్కడి నుంచి తేవాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. ఇప్పుడు ఇలాంటి వారి కోసమే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ఒక కొత్త AI యాప్ StoryKitను తీసుకొస్తోంది. పిల్లల ఫొటోలు, వారి అభిరుచులకు తగినట్టుగా నచ్చిన కథలను క్షణాల్లో తయారు చేసి ఇవ్వడమే ఈ యాప్ ప్రత్యేకత.

కథల్లో మీ పిల్లలే హీరోలు:

ఈ యాప్ పనిచేసే విధానం చాలా సరదాగా ఉంటుంది. ముందుగా మీ పిల్లల ఫొటో లేదా వారికి ఇష్టమైన బొమ్మ ఫొటోను ఇందులో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత కథ ఎక్కడ జరగాలి? అడవిలోనా, అంతరిక్షంలోనా లేదా వింత లోకంలోనా అనేది ఎంచుకోవాలి. చివరగా ఆ కథ ద్వారా పిల్లలకు దయ, ధైర్యం, స్నేహం వంటి ఏ మంచి అలవాటు నేర్పించాలో సెలెక్ట్ చేస్తే చాలు. AI క్షణాల్లో బొమ్మలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్‌తో కూడిన ఒక చక్కటి కథను తయారు చేసి ఇచ్చేస్తుంది.

Advertisement

Also Read: వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

పిల్లల రక్షణకు తొలి ప్రాధాన్యం:

సాధారణంగా AI యాప్స్ అనగానే పిల్లల చేతికి ఇస్తే ఏమైనా ముప్పు ఉంటుందేమోనని తల్లిదండ్రులు భయపడుతుంటారు. కానీ మెటా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ యాప్‌ను కేవలం 18 ఏళ్లు నిండిన పెద్దలు మాత్రమే వాడేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఇందులో ఎలాంటి సోషల్ మీడియా ఫీచర్లు, షేరింగ్ ఆప్షన్లు ఉండవు. అలాగే పిల్లలకు హాని కలిగించే విషయాలు రాకుండా ప్రత్యేక సేఫ్టీ ఫిల్టర్లను అమర్చారు.

అన్ని రకాల స్టోరీస్ ఉంటాయ్:

Advertisement

ఈ యాప్‌లో కథలను మనకు నచ్చిన రూపంలో పొందవచ్చు. బొమ్మలు చూస్తూ, సంగీతం వింటూ చదువుకునేలా ‘పిక్చర్ బుక్’ ఆప్షన్ ఉంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా పడుకునేటప్పుడు వినడానికి ‘ఆడియో బుక్’ కూడా ఉంటుంది. ఒకవేళ మీరే స్వయంగా కథ చెప్పాలనుకుంటే ‘రీడ్ అలావుడ్’ మోడ్ ద్వారా టెక్ట్స్ చూసి చదివి వినిపించవచ్చు. అంతేకాదు.. ఆ కథను PDF ప్రింట్ రూపంలో తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉందా?

ప్రస్తుతం మెటా ఈ యాప్‌ను మెక్సికో వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరీక్షిస్తోంది. మన మనసులోని భావాలను, కథలోని అసలైన ప్రేమను AI పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు కానీ, తీరిక లేని సమయంలో తల్లిదండ్రులకు ఇదొక మంచి సహాయకారిగా మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

Also Read: ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×