E-Paper
Advertisement

లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!
Advertisement

Hyderabad:లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ కంటెంట్ ను వెంటనే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్), ఎక్స్ సంస్థలను ఆదేశించింది. ఈ కేసును హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు ఎన్ వాదించారు. బాధితురాలు ఫోటోలు, వీడియోలు, ఇతర గుర్తింపు వివరాలు సోషల్ మీడియా అలాగే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో కొనసాగుతుండడంతో ఆమె గోప్యతకి, గౌరవం, ప్రతిష్టకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఫిర్యాదు చేసినా.. దక్కని ఫలితం..

పిటిషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఆయా డిజిటల్ ప్లాట్ ఫారంల గ్రీవెన్స్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14,21, సమాచార సాంకేతిక చట్టం – 2000, ఐటీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ) రూల్స్ – 2021, అలాగే లైంగిక నేర బాధితుల గుర్తింపును వెల్లడించకూడదని, సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల అమలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

also read:రూ.1కోటి ఫ్రీ టికెట్స్ పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

200కు పైగా వీడియోలను తొలగించాలని ఆదేశాలు..

విచారణ చేపట్టిన జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ తో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేశారు. అలాగే పిటిషన్ కు జత చేసిన అనెక్సర్ – ఏ లో పేర్కొన్న 200 పైగా యూట్యూబ్ వీడియోలు , ఇంస్టాగ్రామ్ పోస్టులు, ఎక్స్ ట్వీట్ లు అలాగే ఇతర డిజిటల్ ప్రచురణలను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి వాద సంస్థలకు, వ్యక్తిగత నోటీసులు అందజేసేందుకు పిటిషనర్ తరపు న్యాయవాదికి అనుమతి ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను 2026 ఆగస్టు 20 కి వాయిదా వేయడం జరిగింది.

ఇకనైనా సోషల్ మీడియా తీరు మారుతుందా?

Advertisement

ఇక న్యాయ నిపుణుల అభిప్రాయ ప్రకారం.. ఈ మధ్యంతర ఉత్తర్వులు లైంగిక నేర బాధితుల డిజిటల్ గోప్యత గౌరవాన్ని కాపాడడంలో కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. అలాగే భారత చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితుల గుర్తింపును బహిర్గతం చేసే కంటెంట్ ను తొలగించాల్సిన బాధ్యత సోషల్ మీడియా వేదికలపై ఉందని ఈ ఉత్తర్వులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

Related News

మాత్రను నోట్లో వేసుకుని నీళ్లు తాగాలా? లేదా నీళ్లతోపాటు మాత్ర వేసుకోవాలా? ఏది డేంజర్?

ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!

అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. రూ.46 లక్షల సాలరీ.. అన్నీ వదిలి ఇండియన్ ఆర్మీలోకి

బిడ్డకు ఆకలి వేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులకు రెస్పాన్సివ్ ఫీడింగ్ గైడ్

మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ

పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ

పిల్లలు ఇంటి గోడలపై డ్రాయింగ్ వేస్తూ పాడు చేశారా? నో టెన్షన్ క్రేయాన్ మరకలు క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్ ఇవిగో

Big Stories

Advertisement
×