E-Paper
Advertisement

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!
Advertisement

Galaxy Z Fold 7 Price Drop: కొత్తగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 మార్కెట్‌లోకి రావడంతో.. అంతకుముందు విడుదలైన గెలాక్సీ Z ఫోల్డ్ 7 మోడల్‌ ధరను కంపెనీ భారీగా తగ్గించేసింది. ఈ తరుణంలో ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు. శాంసంగ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో రకరకాల ఆఫర్లతో ఈ ఫోన్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం ప్రముఖ బ్యాంక్ కార్డులపై రూ.7,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. ఒకవేళ మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే.. ఫోన్ విలువతో పాటు అదనంగా మరో రూ.7,000 బోనస్ పొందవచ్చు. ఇవి మాత్రమే కాకుండా.. రెఫరల్ కోడ్ ఉపయోగిస్తే అదనంగా రూ.6,000 తగ్గుతుంది. ప్రతి కొనుగోలుపై దాదాపు రూ.3,500 విలువైన రివార్డ్ పాయింట్లు కూడా దక్కుతాయి. ఒకేసారి అంత డబ్బు పెట్టలేని వారి కోసం నెలకు రూ.15,222 నుండి ప్రారంభమయ్యే EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

ఈ ఫోన్ 256GB వేరియంట్ అసలు ధర రూ.1,74,999 కాగా, బ్యాంక్ ఆఫర్లు వాడితే రూ.1,67,999కే లభిస్తుంది. అదే పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పూర్తిగా వినియోగించుకుంటే.. దీని ధర రూ.99,999 వరకు తగ్గే అవకాశం ఉంది. ఇందులో 512GB, 1TB వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ మింట్, బ్లూ షాడో, జెట్‌బ్లాక్, సిల్వర్ షాడో రంగుల్లో లభిస్తుంది.

Advertisement

ఈ Galaxy Z Fold 7 స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉన్నాయి. లోపలి భాగంలో పెద్ద 8 అంగుళాల డిస్‌ప్లే, 4,400mah బ్యాటరీ ఇచ్చారు. ఆర్మోర్ అల్యూమినియం, గొరిల్లా గ్లాస్ రక్షణతో పాటు ఆధునిక గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు ఇంత కంటే మంచి అవకాశం రాదనే చెప్పాలి.

Also Read: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. అత్యంత ఖరీదైన ఫోన్‌గా iPhone 18 Pro Max?!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×