E-Paper
Advertisement

Metaverse courses:- ఆ దేశంలో మెటావర్స్‌ విద్యకు ప్రత్యేకమైన కోర్సులు…

Metaverse courses:- ఆ దేశంలో మెటావర్స్‌ విద్యకు ప్రత్యేకమైన కోర్సులు…
Advertisement

Metaverse courses:- టెక్ ప్రపంచంలో రోజురోజుకీ జరిగే మార్పులు.. మనుషులను పరిగెత్తేలా చేస్తున్నాయి. టెక్ జ్ఞానం ఉంటేనే ఈరోజుల్లో బ్రతుకు సాఫీగా సాగుతుందని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అలాంటివారు ఎప్పటికప్పుడు టెక్నాలజీ రంగంలో అప్డేట్స్‌ను తెలుసుకుంటూ, వాటిపై అవగాహన పెంచుకుంటూ ఉంటారు. ఇది గమనించిన పలు దేశ ప్రభుత్వాలు ఒక ముందడుగు వేశాయి. మెటావర్స్ గురించి స్టూడెంట్స్‌కు ప్రత్యేకమైన కోర్సులు ఏర్పాటు చేస్తున్నాయి.

Advertisement

ప్రస్తుతం చాలావరకు విద్యాసంస్థలు మెటావర్స్ విషయంలో కూడా విద్యార్థులకు ట్రెయినింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. వర్చువల్ రియాలిటీతోనే ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్న మెటావర్స్ అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తోంది. సైబర్‌స్పేస్‌లో తెలియని వ్యక్తులను పరిచయం చేసుకోవడానికి, మనుషులు నిజంగా వెళ్లలేని చోటికి వర్చువల్‌గా ఎంజాయ్ చేయడానికి అవకాశాన్ని అందిస్తోంది ఈ మెటావర్స్. ఇప్పటికే ఈ రియల్ వరల్డ్‌లో మెటావర్స్ ప్రపంచం చాలామందిని ఎంటర్‌టైన్ చేస్తూ టెక్ ప్రపంచంలో వేగంగా ముందుకెళ్తోంది.

సౌత్ కొరియా నుండి తైవాన్ వరకు స్కూల్స్ నుండి ఇతర విద్యాసంస్థల వరకు మెటావర్స్‌తో పాటు ఇతర వీఆర్ అప్లికేషన్స్ విషయంలో కూడా విద్యార్థులకు ట్రెయినింగ్ ఇస్తున్నారు. వారికి కొత్త విషయాలు తెలియజేయడంతో పాటు టెక్నాలజీ రంగంలో వారు కూడా కొత్త ప్రయత్నాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. సౌత్ కొరియాలోని పోహాంగ్ యూనివర్సిటీ అయితే ఏకంగా మెటావర్సిటీలాగా ఏర్పడడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఇప్పటికే మెటావర్స్, సైబర్‌స్పేస్ రంగాల్లో కోర్సులు కూడా ఈ యూనివర్సిటీ అందిస్తోంది.

Advertisement

మరికొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే మెటావర్స్ గురించి చదివిన అండర్ గ్రాడ్యూవేట్స్‌ను నిపుణులతో కలిపి ఫీల్డ్ వర్క్స్‌కు పంపిస్తున్నారు. ఇతర టెక్నాలజీల లాగా వర్చువల్ రియాలిటీ ఫీల్డ్ వర్క్ అనేది అంత సులువైనది కాదని ట్రెయినర్లు చెప్తున్నారు. రెగ్యులర్ క్లాసులు కాకుండా ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన క్లాసులు ఎక్కువగా పెడితే విద్యార్థులకు భవిష్యత్తులో కూడా ఉపయోగకరంగా మారుతాయన్నారు. ప్రపంచ దేశాలు మెటావర్స్‌ను అడాప్ట్ చేసుకోవడం చూసి ఏషియా కూడా అలా చేయాలని సన్నాహాలు చేస్తోంది.

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×