BigTV English

Adipurush Trailer: ‘ఆదిపురుష్‌’.. విజువల్ ఫీస్ట్.. ట్రైలర్‌ అదుర్స్…

Adipurush Trailer: ‘ఆదిపురుష్‌’.. విజువల్ ఫీస్ట్.. ట్రైలర్‌ అదుర్స్…


Adipurush Trailer: 3 నిమిషాల 19 సెకన్ల ట్రైలర్. చూస్తే గూస్‌బంప్స్. అప్పట్లో టీవీల్లో రామాయణం సీరియల్ చూశాం. ఇప్పుడు వెండితెరపై విజువల్ వండర్‌గా రాబోతోంది మోడ్రన్ రామాయణం. రాఘవుడిగా రాముడిగా ప్రభాస్ లుక్స్ అదుర్స్. జానకిగా కృతీ సనన్ పర్‌ఫెక్ట్.

అచ్చమైన రామాయణం. అందరికీ తెలిసిన కథే. కానీ, తీసిన విధానం, తెరపై ఆవిష్కరించిన స్టైల్.. అద్భుత: అన్నట్టు ఉంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ గ్రాఫిక్స్ పనితనం కొట్టొచ్చినట్టు కనిపించింది. అత్యద్భుతమైన విజువల్స్. లైటింగ్, సౌండింగ్.. ఇలా టెక్నికల్‌గా అప్ టు ది మార్క్‌ అనిపిస్తోంది.


విజువల్స్‌తో పాటు డైలాగ్స్‌పైనా బాగా ఫోకస్ చేసినట్టుంది మూవీ టీమ్. రాముడి క్యారెక్టర్‌లో ప్రభాస్ లుక్స్‌తో పాటు వాయిస్ కూడా సరిగ్గా సరిపోయింది. ‘నాకోసం పోరాడొద్దు, వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆరోజు కోసం పోరాడండి.. పోరాడతారా? అయితే దూకండి ముందుకు.. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి’ అంటూ బాహుబలిని మించిన పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు ప్రభాస్. ‘నా ప్రాణమే జానకిలో ఉంది’, ‘మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్నాపెద్ద అవుతాం’.. ఇలా ఎమోషనల్ డైలాగులనూ కూర్చారు. ‘రాఘవ నన్ను పొందడానికి శివధనస్సును విరిచారు, ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి’ అంటూ జానకి నోట సైతం మంచి వెయిట్ ఉన్న డైలాగ్ చెప్పించడం ఆకట్టుకుంది.

ట్రైలర్‌లో రామాయణం ఘట్టాలను మాగ్జిమమ్ కవర్ చేశారు. బంగారు లేడి, సీతను రావణుడు అపహరించుకుపోవడం, రాముడు శబరి ఎంగిలి పళ్లు తినడం, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకురావడం, లంకాదహనం, సముద్రంలో రామసేతు నిర్మాణం, వానరసైన్యం యుద్ధం.. ఇలా ప్రముఖ ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు. అయితే, రావణుడి రోల్‌ను మాత్రం హైడ్ చేసినట్టున్నారు. సీతను ఎత్తుకెళ్లే సమయంలో ఒక ఫ్రేమ్.. ట్రైలర్ ఎండింగ్‌లో ఒక షాట్.. అంతే. టీజర్‌లో చూపించినంత సేపు కూడా ట్రైలర్‌లో సైఫ్‌ అలీఖాన్‌ను చూపించలేదు. కావలనే ప్రాధాన్యం తగ్గించారా? అనే డౌట్.

ఓం రౌత్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఆదిపురుష్.. జూన్‌ 16న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×